Karan Johar : వీళ్లిద్దరికి ఎక్కడ, ఎందుకు చెడింది..?

Karan Johar Serious On Prabhas : బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరన్ జోహార్.. బాహుబలి ప్రభాస్ మధ్య కొద్ది రోజులుగా ఏదో...
Karan Johar Serious On Prabhas : బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరన్ జోహార్.. బాహుబలి ప్రభాస్ మధ్య కొద్ది రోజులుగా ఏదో గ్యాప్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. ప్రభాస్ పై కరన్ జొహర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడనే వార్తలు సినిమా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.
బాహుబలి టైం నుంచి ప్రభాస్, కరన్ జొహర్(Karan Johar) మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. బాహుబలికి హిందీలో డిస్ట్రిబ్యూటర్ గా కరన్ జొహర్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ వ్యవహరించింది. దీంతో హిందీలో ప్రభాస్ కు భారీగా ఫ్యాన్స్ తయారయ్యారని కరన్ జొహర్ అభిమానులు చెబుతుంటారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ కు హిందీలో కూడా సినిమా అవకాశాలు వచ్చాయి. కరన్ జొహర్ కూడా తన ప్రొడక్షన్ లో సినిమా చేయాలని ప్రభాస్ ను కోరాడట. దీనికోసం కొద్ది రోజులు ఆగాలని అడిగాడట. కానీ ప్రభాస్ అది వినిపించుకోకుండా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సాహో చేశాడు.
దాని తర్తాత కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న ప్రభాస్ ఇప్పుడు మరో మూవీ అనౌన్స్ చేశాడు. ఆదిపురుష్ పేరుతో సినిమా చేస్తున్నట్టు.. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.
అయితే.. ఇప్పుడు కూడా తన బ్యానర్ లో సినిమా చేయకుండా T సిరీస్ కంపెనీతో ప్రభాస్ మూవీ చేస్తున్నాడని.. కరన్ జొహర్ అసంతృప్తితో ఉన్నాడట. బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చి పెడితే.. ఇప్పుడు ఇలా తన మాట వినడం లేదని కరన్ సీరియస్ గా ఉన్నాడట.
- గృహలక్ష్మి ఫేం ‘కస్తూరి’ మాములుగా రెచ్చిపోలేదుగా!
- Anasuya White Saree Pics : వైట్ సారీలో ధగధగ మెరుస్తున్న అనసూయ!
అయితే.. నెపోటిజం పేరుతో కరన్ జొహర్ పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఆయనతో మూవీ చేయకుండా ప్రభాస్ మంచి పని చేశాడని మరికొందరు అంటున్నారు.