Top
Batukamma

KCR KEY DECISION : అన్నీ అయ్యాయి.. అదొక్కటే మిగిలింది..!

KCR KEY DECISION : అన్నీ అయ్యాయి.. అదొక్కటే మిగిలింది..!
X
Highlights

KCR KEY DECISION ABOUT GOVERNMENT : రాష్ట్ర రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార పార్టీ మంచి జోష్...

KCR KEY DECISION ABOUT GOVERNMENT : రాష్ట్ర రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార పార్టీ మంచి జోష్ లోనే ఉంది. అటు అపోజిషన్ పార్టీలు కూడా మంచి ఊపులో ఉన్నాయి. ఎన్నికల టైంలో ఉన్న పరిస్థితులే ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం వేడెక్కుతోంది.

కరోనా కేసులు, ట్రీట్మెంట్, పాత్త సెక్రటేరియట్ కూల్చివేత, కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై అపోజిషన్ పార్టీలు రచ్చ రచ్చ చేస్తున్నారు. అటు పోతిరెడ్డిపాడుతో పాటు.. ఏపీ సర్కారు కడుతున్న ప్రాజెక్టులపై సీఎం సైలెంట్ గా ఎందుకున్నారంటూ ఆందోళనలు చేస్తున్నాయి.

అపోజిషన్ ఆరోపణలకు మంత్రులు, ఎమ్మెల్యేలు సమాధానం ఇస్తున్నారు తప్ప.. నేరుగా బయటకు వచ్చి సీఎం మాత్రం మాట్లాడటం లేదు. మొన్నీమధ్యే ఓ ప్రెస్ నోట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పిలిచి అన్నం పెడితే.. కెలికి కయ్యం పెట్టుకుంటారా.. అంటూ సీరియస్ అయ్యారు.

అయితే.. ఈ డ్రామా అంతా నడుస్తుండగానే మరో అంశం తెరపైకి వచ్చింది. ఈ ఇష్యూ తెరపైకి రావడం ఇదేం కొత్తకాదు. గతంలోనూ చాలా రోజులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అదే.. కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారనే వార్త.

అంతా అయిపోయింది. ముఖ్యమంత్రిగా కేటీఆర్ ప్రమాణస్వీకారం తేదీ కూడా ఫిక్స్ అయ్యిందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ మాత్రం దీనిని కొట్టిపారేశారు. ఇంకో 20 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకొచ్చారు.

అయితే.. ఇప్పుడు మరోసారి ఈ అంశం హాట్ టాపిక్ అయ్యింది. బుధవారం రోజున మంత్రులతో ఓ రివ్యూ జరిగింది. సాధారణంగా మంత్రులతో ముఖ్యమంత్రి రివ్యూ చేస్తారు. కానీ బుధవారం రోజున మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది.

ఓ మంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశమవ్వడం ఆసక్తికరంగా మారింది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతోనే తాను సమావేశం నిర్వహించానని కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో ఉన్నారు. దీంతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.

Image

అయితే.. పార్టీలో జరుగుతున్న చర్చ మాత్రం మరోలా ఉంది. త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని.. పార్టీ నేతలంటున్నారు. దానికి రిహార్సల్స్ కోసమే మంత్రులతో సమావేశం నిర్వహించారని అంటున్నారు. ఈ ఎక్స్ పీరియన్స్ ఫ్యూచర్ లో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక.. రివ్యూలు.. ఎలా చేయాలో తెలుసుకునేందుకే కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగిందనే మాట వినబడుతోంది.

అయితే.. గతంలోనూ చాలారోజుల పాటు ఈ ప్రచారం జరిగింది. పార్టీ నేతలు కూడా చాలామంది కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని తమ మనసులో మాటను కూడా బయటపెట్టారు. దీంతో కేటీఆర్ ను సీఎం చేసేందుకు అప్పుడే గ్రౌండ్ వర్క్ మొదలైందనే మాట వినబడింది. ఆ తర్వాత కరోనా కేసులు పెరగడంతో అంతా దానిపై ఫోకస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కరోనా ఇష్యూ కూడా మెల్లిమెల్లిగా డైల్యూట్ అవుతోంది.

Image

మరోవైపు.. కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకే కొత్త సెక్రటేరియట్ కట్టాలనే నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం కూడా చాలా రోజులుగా ఉంది. ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి కూడా అంతా రెడీ అయ్యింది. పాత బిల్డింగ్స్ కూల్చివేతలు పూర్తయ్యాయి. త్వరలోనే కొత్త బిల్డింగ్ పనులు మొదలు కాబోతున్నాయి.

సెక్రటేరియట్ ఒక్కటి పూర్తైతే సీఎం అనుకున్న వాస్తు మార్పులు అన్ని పూర్తైనట్టేనని సన్నిహితులు చెబుతున్నారు. ఆల్రెడీ ప్రగతిభవన్ నిర్మించి క్యాంప్ ఆఫీస్ లో వాస్తుదోషాన్ని సెట్ చేశారు. పాత సెక్రటేరియట్ కూల్చేసి.. అక్కడ కూడా వాస్తును సెట్ చేశారు.

Telangana

ఇక తాను అనుకున్న లక్ష్యాల్లో మిగిలింది కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం ఒక్కటే మిగిలిందనే మాట వినబడుతోంది. అందుకే ఇప్పుడు ఆ దిశగా కార్యాచరణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

Next Story
Share it