Top
Batukamma

అసలు రాజ్-కోటి ఎందుకు విడిపోయారు.. ఇద్దరికీ ఎక్కడ తేడా కొట్టింది?

అసలు రాజ్-కోటి ఎందుకు విడిపోయారు.. ఇద్దరికీ ఎక్కడ తేడా కొట్టింది?
X
Highlights

"రాజ్ - కోటి" తెలుగు సినిమాలో ఒక జంట సంగీత దర్శకులు… వీరిద్దరూ కలిసి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. దాదాపుగా వీరు పది సంవత్సరాలు సంగీత ప్రియులను తమ అద్భుతమైన పాటలతో

"రాజ్ - కోటి" తెలుగు సినిమాలో ఒక జంట సంగీత దర్శకులు… వీరిద్దరూ కలిసి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. దాదాపుగా వీరు పది సంవత్సరాలు సంగీత ప్రియులను తమ అద్భుతమైన పాటలతో అలరించారు.. ఇద్దరు సంగీత నేపధ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు.. ఇందులో రాజ్ ప్రముఖ సంగీత దర్శకులు టి.వి.రాజు కుమారుడు. ఇతని పూర్తి పేరు తోటకూర సోమరాజు.. ఇక కోటి ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు కుమారుడు. ఇతని పూర్తి పేరు సాలూరి కోటేశ్వరరావు.

రాజ్ - కోటి ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్.. ఇందులో రాజ్ కోటి వాళ్ళ నాన్న సాలూరి రాజేశ్వరరావు దగ్గర శిష్యరికం చేశారు.. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ గా చేరారు.. ఇక అప్పటికే కోటి చక్రవర్తి దగ్గర గిటారిస్ట్‌గా మెలకువలు నేర్చుకుంటున్నాడు.. దీనితో అక్కడ వారిద్దరి మధ్య స్నేహం మరింతగా బలపడింది.. చక్రవర్తి టీంలో రాజ్-కోటికి మంచి పేరు ఉండేది..

ఇలాంటి సమయంలో ముందుగా రాజ్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం రాగా కోటితో ఇద్దరం కలిసి చేద్దామని రాజ్ ప్రపోజల్ తెచ్చారట… అలా కొన్ని రోజుల తర్వాత అందుకు కోటి ఒప్పుకోగా ఇద్దరు కలిసి 1984లో 'ప్రళయ గర్జన’ సినిమాతో "రాజ్-కోటి" గా టాలీవుడ్ లోకి సంగీత దర్శకులుగా ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న-తమ్ముడు లాంటి విజయవంతమైన చిత్రాలకు వీరే సంగీతాన్ని సమకూర్చారు. హలో బ్రదర్ మూవీ సాంగ్స్ కి గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా నంది అవార్డు అందుకున్నారు..

వీరిలో రాజ్ ఆర్చేస్తాకి నొటేషన్స్ చెప్పి కండక్టింగ్ చేసేవారు. కంపోజింగ్ ఇద్దరూ కలసి చేసుకునేవారు. ఇక నిర్మాతలతో, దర్శకులతో చర్చలు తదితర విషయాలన్నీ కోటి చూసుకునేవారు. అయితే ఇండస్ట్రీలోని కొందరి చెడు మాటల వల్ల కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో వీరిద్దరూ విడిపోయారు. వీరి కాంబినేషన్ లో చివరగా గాడ్ ఫాథర్ మూవీ వచ్చింది.. అయితే ఇప్పటికి రాజ్ చాలా మంచి వాడు అని, చాలా అమాయకుడని ఈ విషయాలను కోటి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. విడిపోదాం అనే ప్రపోజల్ కూడా ముందు రాజ్ తీసుకువచ్చాడని, వద్దు అని నేను చాలా సార్లు చెప్పుకోచ్చానని కోటి ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు..

సంగీత దర్శకులుగా పనిచేసిన వీరు విడిపోయిన తరువాత కోటి మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా మారారు. ఇక అటు రాజ్ కొన్ని సినిమాలు చేశాడు కానీ అందులో చెప్పుకోదగ్గ సినిమా "సిసింద్రీ" ఒక్కటే.. ఇక ఆ తరవాత అయన పూర్తిగా ఫెడ్ అవుట్ అయిపోయారు.

Next Story
Share it