Top
Batukamma

Leaders illegal affairs : ఇల్లీగల్ బాగోతాలు.. బండి సంజయ్ కి కొత్త తలనొప్పులు..!

Leaders illegal affairs : ఇల్లీగల్ బాగోతాలు.. బండి సంజయ్ కి కొత్త తలనొప్పులు..!
X
Highlights

రాష్ట్రంలో పార్టీని చక్కదిద్దే పనిలో ఉన్న సంజయ్ కి జిల్లాలో ఇలాంటి సమస్య రావడంతో... దీన్ని ఎలా సెట్ రైట్ చేస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leaders illegal affairs a new challenge to bandi sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. సంజయ్ పార్టీ స్టేట్ చీఫ్ అయ్యాక.. కేడర్ లో కాస్త ఊపు వచ్చింది. అప్పటి వరకు కరీంనగర్ కే పరిమితమైన ఆయన ఫాలోయింగ్.. రాష్ట్రమంతటా పెరిగింది. దీంతో పార్టీ ఇక దూసుకెళ్లడం ఖాయం.. అధికారంలోకి రావడం ఖాయమని ఫిక్సయ్యారు చాలామంది.

కానీ.. సొంత జిల్లాలో, సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో గుప్పుమన్న రాసలీలల వ్యవహారం(Leaders illegal affairs :) ఇప్పుడు చినికి చినికి గాలివానగా మారుతోంది. రాసలీలల వ్యవహారం బయటపడేవరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బాస సత్యనారాయణ ఇష్యూలో లోతుకెళ్లే కొద్ది విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి

బాస సత్యనారాయణతో సహజీవనం చేశానంటూ బాధిత మహిళ ఓ వీడియో రిలీజ్ చేసింది. బాస సత్యనారాయణతో ఏడాదిగా సంబంధంటూ చెప్పుకొచ్చింది. అయితే.. ఈ బాగోతం బయటకొచ్చాక.. ఇదొక్కటే కేసు అనుకున్నారు అంతా.

కానీ.. బాధిత మహిళ రిలీజ్ చేసిన వీడియోలో ఓ నలుగురైదురిగి పేర్లు కూడా బయటపెట్టింది. బీజేపీ జిల్లా నాయకులుగా ఉన్న వారంతా అక్రమ సంబంధాలు నడిపిస్తున్నారు. తాను ఒంటరిగా ఉంటుండటంతో.. తన ఇంటికి వచ్చి రాసలీలలు కొనసాగించారని చెబుతోంది. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరించారని అంటోంది.

https://www.youtube.com/watch?reload=9&v=FevaUEzI0y4&feature=youtu.be

బీజేపీలో మహిళ పరిస్థితి బాగోలేదని.. ఆడవాళ్లు పార్టీలోకి రాకూడదా..? వచ్చినవాళ్లను పార్టీలో ఇలాగే వాడుకుంటారా..? అంటూ ప్రశ్నిస్తోంది ఆ మహిళ.

బీజేపీలోనే చాలాకాలంగా ఉంటూ... ఏకంగా జిల్లా అధ్యక్షుడితో సహజీవనం చేసిన మహిళ ఇప్పుడు ఇలాంటి సంచలన విషయాలు బయటపెడుతుండటం బండి సంజయ్ కి తలనొప్పిగా మారింది. రాష్ట్రంలో పార్టీని చక్కదిద్దే పనిలో ఉన్న సంజయ్ కి జిల్లాలో ఇలాంటి సమస్య రావడంతో... దీన్ని ఎలా సెట్ రైట్ చేస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

..

TRENDING VIDEO :

https://youtu.be/T5iFk3bF2MU

Read Also :

Next Story
Share it