Top
Batukamma

LEPTOSPIROSIS : తెలంగాణలో భయపెడుతున్న కొత్త వ్యాధి..!

LEPTOSPIROSIS : తెలంగాణలో భయపెడుతున్న కొత్త వ్యాధి..!
X
Highlights

LEPTOSPIROSIS CASES IN TELANGANA : ప్రజలంతా ప్రస్తుతం కరోనా భయంతో వణికిపోతున్నారు. దీనికితోడు వర్షాకాలం...

LEPTOSPIROSIS CASES IN TELANGANA : ప్రజలంతా ప్రస్తుతం కరోనా భయంతో వణికిపోతున్నారు. దీనికితోడు వర్షాకాలం మొదలైంది. దీంతో సీజనల్ వ్యాధుల టెన్షన్ కూడా పట్టుకుంది. ఓ వైపు కరోనా.. మరోవైపు సీజనల్ వ్యాధులతో ప్రజలు పరేషాన్ అవుతున్నారు. ఈ సమయంలోనే మరో కొత్త మహమ్మారి విరుచుకుపడుతోంది.

ఆదిలాబాద్ జిల్లాలో కొత్త వ్యాధి బయటపడింది. పచ్చ కామెర్ల లాంటి లక్షణాలుంటే లెప్టోస్పీరోసీస్ అనే వ్యాధికి సంబంధించిన మొదటి కేసును ఆదిలాబాద్ జిల్లాలో గుర్తించారు. ఇది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. లెప్టోస్పీరోసీస్ సోకిన జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది.

ఎద్దులు, ఆవులు, గేదెలు, పందులు, గుర్రాలు, కుక్కలు, అడవి జంతువుల్లో ఈ చాలా ఏళ్ల వరకు జీవనం సాగిస్తుంది. అయితే.. జంతువులకు సోకినప్పుడు అందులో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ.. వాటి మూత్రం, ఇతర శరీర ద్రవాల ద్వారా అవి నేల, నీటిలోకి చేరిపోతాయి.

బ్యాక్టీరియా సోకిన జంతువుల మూత్రం కలిసిన నీరు లేదా మట్టిని తాకినప్పుడు అది మానవులకు సోకుతుంది. దీని లక్షణాలు కూడా కాస్త కరోనా లక్షణాలకు దగ్గరగానే ఉంటాయి.

లెఫ్టోస్పీరోసీస్ సోకిన వారికి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కడరాల నొప్పులు, వాంతులు, జాండిస్, కళ్లు ఎర్రబడటం, కడుపు నొప్పి, డయేరియా, శరీరంపై కురుపులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి ట్రీట్మెంట్ చేస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

Leptospira

ఇది జాండిస్ ను కలిగిస్తుంది కాబట్టి.. లివర్, కిడ్నీలపై తీవ్రమైన ప్రభావం పడి అవి ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో లెప్టోస్పీరోసీస్ కు సంబంధించిన ఓ కేసు బయటపడింది. దీంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఈ కేసు బయటపడిన ఏరియాలో మరికొంత మందికి పరీక్షలు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

అటు కేరళ, ముంబైలో ఇటీవలి వరదల తర్వాత లెప్టోస్పీరోసీస్ కేసులు భయం పట్టుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Next Story
Share it