Love stories : ఈ కొంపలో అన్నీ ఆ టైపు రిలేషన్సే..!

జోర్దార్ సుజాతను అభి చెల్లి అన్నాడని తెగ బాధపడిపోయింది. అంతకు ముందు వారంలో అభితో నీతో మాట్లాడాలని ఉంది.. స్పేస్ ఇవ్వు అంటూ అడిగిన సుజాత..
love stories in biggboss house : ఆ అఖిల్ అయితే మొనాల్‌ని విడిచి ఒక్కక్షణం కూడా ఉండలేకపోతున్నాడు.. ఒకరికొకరు తినిపించుకోవడాలు.. హగ్‌లు యవ్వారాలు మామూలుగా లేవు. నేనేమైనా తక్కువా అన్నట్టుగా అఖిల్‌కి అభిజిత్ గట్టి పోటీ ఇస్తుంటాడు. ఆమెకు పొరమారితే ఈ ఇద్దరూ వాటర్ బాటిల్స్ ఇవ్వడానికి పోటీ పడుతుంటారు. అందులో కూడా పోటీనే ఏంటో అర్థం కాదు.
సరే ఈ ముగ్గురు ట్రై యాంగిల్ లవ్ స్టోరీని పక్కన పెడితే.. అభిజిత్ అయితే పక్కన అమ్మాయి లేకపోతే శ్వాస ఆగిపోతుంది అన్నట్టుగా ఆడగాలి కోసం తెగ తాపత్రయ పడుతుంటాడు.. కుదిరితే మొనాల్.. కుదరకపోతే దేత్తడి హారికతో అర్థరాత్రైనా సరే ముచ్చట్లకు ఎండ్ కార్డ్ వేయడు. ఎప్పుడు చూసినా అభిజిత్ ఈ ఇద్దరితోనే ఉంటుంటాడు. దేత్తడి హారిక అయితే అభిజిత్‌ని ఇష్టపడుతుందని అభి దగ్గరే ఓపెన్ అయ్యింది మొనాల్. అందుకు తగ్గట్టుగానే హారిక అయితే ఎప్పుడూ అభిజిత్ వెంట పడుతూనే కనిపిస్తుంది.
- వందేళ్లు ఆరోగ్యంగా బతకాలంటే ఈ బియ్యం తినండి
- యాంకర్ రోజా కత్తిలాంటి ఫోటోలు
- జబర్దస్త్ .. కాస్కో … వచ్చారు ఇద్దరు మొగుళ్లు!
ఇక జోర్దార్ సుజాతను అభి చెల్లి అన్నాడని తెగ బాధపడిపోయింది. అంతకు ముందు వారంలో అభితో నీతో మాట్లాడాలని ఉంది.. స్పేస్ ఇవ్వు అంటూ అడిగిన సుజాత.. అతను వద్దన్నా తినిపించడానికి తెగ ప్రయత్నించింది.
వీళ్లే కాదు.. ఆ మధ్య బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన సూర్య కిరణ్ అయితే అరియానా-మెహబూబ్‌ల మధ్య కొత్త కథ నడుస్తుందని గుట్టు చెప్పేశాడు.
అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి రెండో వారం ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణి.. ఈ ఎఫైర్ల గుట్టుపై ఓపెన్ అయ్యింది. మీరు చూసేది.. వాళ్లు చూపించేది అంతా నిజమే.. హౌస్‌లో చాలా ఎఫైర్లు నడుస్తున్నాయి అంటూ ఆ ఎఫైర్ల బాగోతం గుట్టుని విప్పారు.
కళ్యాణి మాట్లాడుతూ.. మొనాల్, అభిజిత్, అఖిల్.. ఈ ముగ్గురి మధ్య ఏదో నడుస్తున్నట్టు.. హౌస్‌లో మాకూ కనిపించింది. వాళ్లు ముగ్గురూ కలిసి సెపరేట్‌గా ఉండటం.. ఇద్దరు ఇద్దరుగా తినడం.. తినిపించుకోవడం.. వాళ్ల ముగ్గుర్నీ గమనిస్తే ఎప్పుడూ అఖిల్-మొనాల్ కనిపిస్తారు.. లేదంటే.. అభిజిత్-మోనాల్‌లు కనిపిస్తారు. అంతేతప్ప వేరే వాళ్లతో వాళ్లు ఉండరు.
- ఎస్పీ బాలుకి కరోనా రావడానికి ఆ షోనే కారణమా?
- సమంత రచ్చరంబోలా!
- ఛీ ఛీ.. జబర్దస్త్ నుంచి ముందు అనసూయను తీసిపారేయండి!
మొనాల్ మహా అయితే వంట గదిలో కనిపించేది. మిగిలిన టైం అంతా వాళ్లతోనే.. ఏదైనా టాస్క్ చేసేటప్పుడు మాత్రమే ఆమె ఇన్వాల్వ్ అవుతుంది తప్ప.. మిగిలిన సమయం అంతా అఖిల్-అభిజిత్లతోనే. వాళ్లు సెపరేట్‌గా రాత్రి పన్నెండు.. ఒంటిగంట అయినా లైట్లు ఆఫ్ చేసుకుని కూర్చుని మాట్లాడుకుంటారు. దీన్ని బట్టి వాళ్ల మధ్య ఏదో ఉందని క్లియర్‌గా చూసే జనానికే కాదు మాకూ అర్థమైంది.
అలాగే.. అరియానా గ్లోరి- మొహబూబ్‌లు కూడా చాలా క్లోజ్‌గా ఉంటున్నారు. అది మేం కూడా చూశాం. మరి అది లవ్వా-ఫ్రెండ్ షిప్ అనేది తెలియదు. అలాగే అభిజిత్-హారికలు కూడా మొదలుపెట్టారు. వీళ్లే కాదు.. సుజాత కూడా కొన్ని నడిపిస్తుంది.
ముఖ్యంగా యంగ్ స్టార్స్‌ని పెట్టడం వల్ల ఈ ట్రాక్‌లు వర్కౌట్ అవుతుందని అనుకున్నారో ఏమో తెలియదు కాని.. నాకు తెలిసినంతవరకూ లోపల ఏదో విషయం జరుగుతుంది. ఎందుకంటే ఆపోజిట్ సెక్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఎట్రాక్ట్ అవుతారు. వయసులో ఉన్న అమ్మాయిలు-అబ్బాయిలు ఒకేచోట ఉన్నప్పుడు ఏదొక విషయంలో నచ్చేస్తారు కదా.. అలా నచ్చి హౌస్‌లో వాళ్ల వాళ్ల పనిచేస్తున్నారు.
వాళ్ల లవ్ ట్రాక్ నిజంగానే ఉందా? లేదంటే టైం పాస్కా అన్నది అప్పుడే చెప్పలేం’ అంటూ బిగ్ బాస్ హౌస్‌లో నడుస్తున్న లవ్ ఎఫైర్లను ఒక్కొక్కటిగా బయటపెట్టింది కరాటే కళ్యాణి.
- suguna bolisetti
TRENDING VIDEO :
[embed]https://youtu.be/FPHkkDczPZ0[/embed]
- affairs in biggboss house anchor ariyana in biggboss batukamma Batukamma.com Bigg Boss Telugu Contestants biggboss telugu biggboss telugu 4 biggboss4 jordar sujatha jordar sujatha in bigg boss love stories in bigg boss house love stories in biggboss house Monal Gajjar monal gajjar in biggboss sujatha jordar Telugu news tv9 telugu vaarthalu బతుకమ్మ