Top
Batukamma

Mahatma Gandhi : అమ్మకానికి మహాత్మాగాంధీ కళ్లజోడు

Mahatma Gandhi : అమ్మకానికి మహాత్మాగాంధీ కళ్లజోడు
X
Highlights

Mahatma Gandhi Personal Spectacles on auction : జాతిపిత మహాత్మాగాంధీకి చెందిన మరో వస్తువును లండన్ లో వేలానికి ...

Mahatma Gandhi Personal Spectacles on auction : జాతిపిత మహాత్మాగాంధీకి చెందిన మరో వస్తువును లండన్ లో వేలానికి పెట్టారు. లండన్ కు చెందిన ఈస్ట్ బ్రిస్టల్ ఆక్షన్స్ వెబ్ సైట్ లో మహాత్ముడి కళ్లజోడును వేలానికి పెట్టారు.

బంగారం పూతపూసిన గుండ్రటి కళ్లద్దాల ఫొటోను వెబ్ సైట్ లో పెట్టారు. వీటిని 1900 సంవత్సంరంలో మహాత్మాగాందీ వాడారని వీటిని వేలానికి పెట్టిన వ్యక్తి చెప్పారు.

తన తాత సౌతాఫ్రికాలోని బ్రిటీష్ పెట్రోలియం కంపెనీలో పనిచేసేవాడని.. అతడు కళ్లజోడు తమకు ఇచ్చాడని చెప్పారు. మహాత్మాగాంధీ తన తాతకు ఇచ్చారని.. ప్రస్తుతం వాటిని అమ్మాలనుకుంటున్నానన్నాడు.

Pair of Mahatma Gandhi's Personal Spectacles

ఈ నెల 21న ఈ కళ్లజోడు వేలం జరగనుంది. ఇప్పటికే 600 పౌండ్ల వరకు ధర పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. వేలంపాటలో దీనికి 10 నుంచి 15 వేల పౌండ్ల వరకు వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

Read Aso :

Next Story
Share it