Subscribe

News

ప్రధాని అంటే పట్టింపే లేదా..? వాటీజ్ దిస్ దీదీ..?

mamata banerjee disrespects prime minister modi

మమతా బెనర్జీ ఓ ఫైర్ బ్రాండ్. ఎవరికి తల వంచరు. కాంగ్రెస్ నుంచి విడిపోయి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మమతా బెనర్జీ… ఎవరి మాటా వినరు. వెస్ట్ బెంగాల్ ను తనదైన స్టైల్లో నడిపిస్తున్నారు.

చాలా కాలంగా వెస్ట్ బెంగాల్ లో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ మమత బెనర్జీ మాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి.. మమతా బెనర్జీకి నిత్యం వార్ జరుగుతూనే ఉంటుంది. కార్యకర్తల హత్యలు అక్కడ నిత్యకృత్యం.

ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్ పన్ తుఫాన్ బెంగాల్ ను ముంచెత్తింది. చాలా సిటీలు అతలాకుతలమయ్యాయి. దీంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏరియల్ సర్వే కోసం వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన ఓ సంఘటన ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఎయిర్ పోర్ట్ లో ప్రధానికి స్వాగతం పలికేందుకు గవర్నర్, సీఎం, ఇతర నేతలు వెళ్లారు. అయితే.. మోడీ ఫ్లైట్ దిగుతున్న టైంలో అందరు ఆయన వైపు చూస్తోంటే.. మమత మాత్రం తన చేతుల్లోని పేపర్లు చూస్తూ ఉండిపోయారు. మోడీని పెద్దగా పట్టించుకోలేదు.

Image

మోడీ, మమత కలిసి వరద పరిస్థితిపై రివ్యూ చేశారు. అయితే వెయ్యి కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించారు మోడీ. కానీ వాటి మీద మమత విమర్శలు చేశారు.

ఇక.. ఈ ఘటనపై బెంగాల్ బీజేపీ ఫైర్ అవుతోంది. ప్రధాని సహాయం చేయడానికి వస్తే ఇదేనే మమత బెనర్జీ ఇచ్చే గౌరవం ఇదేనా అని మండిపడుతున్నారు.

 

(Visited 6 times, 1 visits today)