Top
Batukamma

Man Suicide : అత్తింటి వేధింపులకు "అల్లుడు బలి"..!

Man Suicide : అత్తింటి వేధింపులకు అల్లుడు బలి..!
X
Highlights

అత్తింటి వేధింపులకు అబల బలి”.. “అత్తింటి వేధింపులతో నవ వధువు ఆత్మహత్య”.. “అత్తింటి వేధింపులతో యువతి ఆత్మహత్య”.. అనే వార్తలు చూడటం మనకు అలవాటై పోయింది.

Man suicide due to in laws harassment : అవును.. మీరు చదివింది నిజమే. అత్తింటి వేధింపులకు ఓ అల్లుడు బలయ్యాడు. వారు పెట్టే పోరు పడలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సాధారణంగా ఇలాంటి వార్తలు ఎప్పుడూ.. ఎక్కడా.. చూసి ఉండం. ప్రతీసారి.. “అత్తింటి వేధింపులకు అబల బలి”.. “అత్తింటి వేధింపులతో నవ వధువు ఆత్మహత్య”.. “అత్తింటి వేధింపులతో యువతి ఆత్మహత్య”.. అనే వార్తలు చూడటం మనకు అలవాటై పోయింది.

రెగ్యులర్ గా టీవీల్లో, పేపర్లలో ఇలాంటి వార్తలే వస్తుంటాయి. కానీ హైదరాబాద్(hyderabad) లో ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఓ ఘటన జరిగింది. ఓ యువకుడు అత్తింటి వేధింపులు భరించలేక తనువు చాలించాడు(Man Suicide). ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్ లోని కంచన్ బాగ్ పరిధిలోని బాబానగర్ కు చెందిన సయ్యద్ మోహిన్ కు కామారెడ్డికి(kamareddy) చెందిన యువతితో పెళ్లి జరిగింది. పెద్దల సమక్షంలో.. ఇందరి అంగీకారంతో పెళ్లి జరిపించారు. కొద్ది రోజులు వీరి కాపురం బాగానే సాగింది.

కానీ.. అక్కడే వీరి మధ్యలోకి సమస్యలు ఎంటరయ్యాయి. వీరి కాపురంలో అత్తామామలు(అమ్మాయి తల్లితండ్రి) ఎంటరయ్యారని యువకుడి బంధువులు చెబుతున్నారు. పెళ్లైన నాటి నుంచి వేధింపులకు గురి చేస్తున్నారని అంటున్నారు.

ఈ గొడవల కారణంగా ఆరు నెలల క్రితం భర్తతో గొడవపడిన యువతి.. కామారెడ్డిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి సమస్యలు మరింత పెరిగాయి. అత్తామామ పోరు విపరీతంగా పెరిగిపోయిందని.. దీంతో మానసికంగా కుంగిపోయాడని.. బంధువులు అంటున్నారు.

ఈ సమస్యలతో వేగలేక ఆ యువకుడు.. ఉరివేసుకుని తనువు చాలించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అసలు ఏం జరిగిందనేది ఎంక్వైరీ చేస్తున్నారు.

Read Also :

TRENDING VIDEO :

[embed]https://youtu.be/FevaUEzI0y4[/embed]

Next Story
Share it