Top
Batukamma

పగలు సెకండ్ వైఫ్ .. నైట్ ఫస్ట్ వైఫ్ .. వీడు మామూలోడు కాదు..!

పగలు సెకండ్ వైఫ్ .. నైట్ ఫస్ట్ వైఫ్ .. వీడు మామూలోడు కాదు..!
X
Highlights

ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో మోసాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. అయితే చదువుకున్న వారు ఈ మోసాలకు పాల్పడుతుండటం...

ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో మోసాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. అయితే చదువుకున్న వారు ఈ మోసాలకు పాల్పడుతుండటం ఇక్కడ దారుణంగా చెప్పుకోవచ్చు.. తాజాగా చదువుకోడానికి హైదరాబాద్ కి వచ్చిన యువతీకి ఓ యువకుడు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకొని గర్భవతిని చేసి వదిలేశాడు..

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎస్ కే షబీనా అనే గుంటూరు కి చెందిన 25 ఏళ్ల యువతికి ఓ ఫ్రెండ్ ద్వారా అవుసరి సంపత్(29) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు...ఆ పరిచయం కాస్తా రాను రాను ప్రేమగా మారింది. అయితే తనకి పెళ్లి కాలేదని, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పిన సంపత్ ఆమెను 2018 , మార్చి 14 న వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఆమెతో ఆవులమందలో కాపురం పెట్టాడు.

అయితే అంతకుముందే సంపత్ కి పెళ్లి అయి ఓ కూతురు కూడా ఉంది. ఇక రెండో భార్యతో నైట్ షిఫ్ట్ అని చెప్పి మొదటి భార్యతో కొన్ని రోజులు మనోడు సంసారం అనే ఓ చదరంగం అనే కథను నడిపించాడు. ఎప్పటికైనా గుట్టు రట్టు కావాల్సిందే అన్నట్టుగా మనోడి బండారం మొత్తం ఓ రోజు బయట పడింది.

మే 31 న సంపత్ ఈసీఐఎల్ లో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్లి రెండో పెళ్లి, సంసారం అనే తన జీవితం లోని ఓ చాప్టర్ ని పూసగుచ్చినట్టు చెప్పేశాడు.. ఈ విషయం కాస్తా ఆ స్నేహితుడు సంపత్ మొదటి భార్యకు చేరవేయడంతో కథ క్లైమాక్స్ కి వచ్చింది.

దీనితో షబీనా ఇంట్లో ఉన్న సంపత్ దగ్గరికి వెళ్ళి పెద్ద గొడవే పెట్టుకుంది. దీంతో సంపత్ రెండో భార్యను కాదని మొదటి భార్య వైపే మొగ్గుచూపి వెళ్ళిపోయాడు.

దీనితో మోసపోయాను అని తెలుసుకున్న షబీనా సంపత్ పై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది.. ఇదిలా ఉంటే షబీనా ఈ నెల తొమ్మిదిన ఓ బాబుకు జన్మనిచ్చింది.

Next Story
Share it