Top
Batukamma

Married Woman Murdered : మహిళ దారుణ హత్య.. తమ్ముడే హంతకుడు?

Married Woman Murdered : మహిళ దారుణ హత్య.. తమ్ముడే హంతకుడు?
X
Highlights

Married Woman Murdered : కడప జిల్లా పులివెందులలో దారుణం జరిగింది.. ఓ మహిళ దారుణహత్యకు గురైంది. పోలీసులు...

Married Woman Murdered : కడప జిల్లా పులివెందులలో దారుణం జరిగింది.. ఓ మహిళ దారుణహత్యకు గురైంది. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం.. వైఎస్‌ విజయలక్ష్మి కాలనీకి చెందిన శివరాణి (38)కి కొన్నేళ్ళ క్రితం అనంతపురం జిల్లా తలుపుల మండలం ఉడమలకుర్తి గ్రామానికి చెందిన గోపాల్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయితే భర్తతో మనస్పర్థల రావడంతో అతన్ని తన పిల్లలను కూడా వదిలేసింది శివరాణి.. ఆ తరవాత పులివెందులకు వచ్చి వైఎస్‌ విజయలక్ష్మి కాలనీ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటోంది. అక్కడ స్థానికంగా అప్పులు ఇచ్చుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుంది.. ఈ క్రమంలో శనివారం రాత్రి దారుణ హత్యకి గురైంది.

ఆదివారం పాలు పోయడానికి వచ్చిన వ్యక్తి ఎంత పిలిచినా లేవలేకపోయేసరికి అనుమానం వచ్చి తలుపు నెట్టి చూడగా శివరాణి విగతజీవిగా పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకున్నారు.

ఇక శివరాణి తండ్రి ఆర్టీసీ సంస్థలో పనిచేస్తూ రిటైర్ అయ్యాడు.. మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు.. అతని మొదటి భార్య కూతురే ఈ శివరాణి.. ఇక రెండో భార్యకి ఓ కొడుకు ఉన్నాడు. అతనికి తాజాగా వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో అతని గురించి లేనిపోనివి చెప్పడంతో ఆ వివాహం రద్దు అయిపొయింది..

దీనితో కక్ష పెంచుకొని హత్య చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఇక శివరాణికి పట్టణంలోని ఓ యువకునితో వివాహేతర సంబంధం ఉంది. వారి మధ్య ఏమైనా గొడవ జరిగి ఈ హత్యకి దారి తీసిందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it