Top
Batukamma

MBA ENTRANCE : ఎంబీఏ ఎంట్రన్స్ సెప్టెంబర్ 5న

MBA ENTRANCE : ఎంబీఏ ఎంట్రన్స్ సెప్టెంబర్ 5న
X
Highlights

MBA ENTRANCE ON SEPTEMBER 5TH : డిగ్రీ తర్వాత బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్సుల వైపు వెళ్లాలనుకునే వారికి గుడ్...

MBA ENTRANCE ON SEPTEMBER 5TH : డిగ్రీ తర్వాత బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్సుల వైపు వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్. MBA, PGDM కోర్సులకు AICTE నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సంస్థ ఇన్నోవేషన్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్, వెంచర్ డెవలప్​మెంట్ కోర్సులు అందిస్తోంది.

2 ఏళ్ల కోర్సుల(MBA ENTRANCE)కు ప్రస్తుతం నోటిఫికేషన్ ఇచ్చింది. దేశంలో 15 ఇంజినీరింగ్ కాలేజీల్లో మాత్రమే ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. AICTE కామన్​ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఈ సీట్లను ఫిలప్ చేస్తారు.

డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి ఇది మంచి అవకాశం. డిగ్రీ, ఇంజినీరింగ్ కంప్లీట్ అయిన వారు ఈ ఎగ్జామ్ కు ఎలిజిబుల్ అవుతారు.

ఈ నెల ​ 28 వరకు ఆన్​లైన్​లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 5 న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ లో వచ్చే మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. దాని ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి అడ్మిషన్లు ఇస్తారు.

అక్టోబర్ 15 లోగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. సెప్టెంబర్ 10 వరకు రిజల్ట్స్ ఇవ్వనున్నారు.

వెబ్​సైట్ : http://cet.cbtexam.in/

దరకాస్తుకు చివరి తేదీ : ఆగస్ట్​ 28

ప్రవేశపరీక్ష : సెప్టెంబర్ 5

..

ఇవి కూడా చదవండి :

Next Story
Share it