Top
Batukamma

HBD Chiranjeevi : చిరు బర్త్‌డే కామన్‌ డీపీ.. దీనికున్న స్పెషల్ ఇదే!

HBD Chiranjeevi : చిరు బర్త్‌డే కామన్‌ డీపీ.. దీనికున్న స్పెషల్ ఇదే!
X
Highlights

HBD Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన 65 పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.. ఈ సందర్భంగా...

HBD Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన 65 పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.. ఈ సందర్భంగా అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. ఇక అభిమానులు అయన మీదా ఉన్న అభిమానంతో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన పోస్టర్లను షేర్ చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు.. ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కామన్‌ డీపీని ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ఈ డీపీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది..

చరణ్ విడుదల చేసిన ఈ డీపీలో చిరు కెరీర్ ని ప్రతిబింబించేలా కనిపిస్తుంది. అయన సినీ కెరీర్ లో బాగా హిట్ అయిన సినిమాలను ఒక్కో మెట్టుపై ఉంచారు. ‘ఖైదీ’, ‘పసివాడి ప్రాణం’, ‘స్వయంకృషి’, ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘ఘరానా మొగుడు’, ‘ఇంద్ర’, ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రాల్లో పాత్రలను ఒక్కో మెట్టుపై నిలబెడుతూ చూపించారు. మెగాస్టార్‌ టైటిల్‌లో ‘సైరా: నరసింహారెడ్డి’ పాత్రను ఉంచారు. అయితే శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకి దూరంగా ఉన్నారు. దానిని ఈ డీపీలో ఉంచుతూ.. ఆ సమయాన్ని కూడా ఈ డీపీలో చూపించారు.. ఆ కాలాన్ని మొక్కలు ఉన్నట్లు చూపించారు. ఆ తర్వాత ఖైది, సైరా పోస్టర్ లను ఉంచారు. ఇక అయన పుట్టిన రోజు సందర్భంగా మోషన్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఒకేసారి 100 మంది సినీ నటులు, వీరాభిమానులు దీనిని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.

https://www.youtube.com/watch?time_continue=37&v=MlT-D5c1Y0U&feature=emb_title

Next Story
Share it