Top
Batukamma

టీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకొని కాంగ్రెస్ కి ఓట్లు వేయండి!

టీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకొని కాంగ్రెస్ కి ఓట్లు వేయండి!
X
Highlights

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం పైన కీలక వాఖ్యలు చేశారు. రాబోయే GHMC ఎన్నికల్లో టీఆర్ఎస్...

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం పైన కీలక వాఖ్యలు చేశారు. రాబోయే GHMC ఎన్నికల్లో టీఆర్ఎస్ దగ్గర ప్రజలు డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని అన్నారు.. టీఆర్ఎస్ నాయకుల దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని, ఒక్కో ఓటుకు అయిదు వేల నుంచి పది వేల వరకు ఇస్తారని అంటూ కీలక వాఖ్యలు చేశారు అయన..

గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీకి అసలు అభ్యర్థులే లేరని, కాంగ్రెస్ పార్టీ నేతలను చేర్పించుకొని టిక్కెట్ ఇచ్చారనే విషయం మర్చిపోవద్దని, ఈ విషయాన్నీ టీఆర్ఎస్ నేతలు గుర్తించుకోవాలని సూచించారు. ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా బయట కనపడుతున్నారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Thurupu Jayaprakash Reddy(Jagga Reddy) | MLA | Congress | Sangareddy

అటు లక్ష డబుల్ బెడ్ రూమ్ లు చూపిస్తామని గొప్పలు చెప్పిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 15 వేలకి మించి డబుల్ బెడ్ రూమ్ లు చూపించలేకపోయరని జగారెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం టీఆర్ఎస్ దుకాణం నడుస్తుందని, ప్రతి ఒక్కరికి ఓ రోజు వస్తుందంటూ ఎంతటివారైనా ఏదో ఓ రోజు ఓడాల్సిందేనని అంటూ కీలక వాఖ్యలు చేశారు.

వచ్చే GHMC ఎన్నికల్లో మేయర్ స్థానం కాంగ్రెస్ కి వస్తే హైదరాబాద్ సమస్యలపై ప్రభుత్వం పైన గట్టిగా పోరాటం చేస్తామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కచ్చితంగా ఇప్పిస్తామని జగ్గారెడ్డి చెప్పారు.

Next Story
Share it