Top
Batukamma

Murder Movie : వర్మకు షాక్. మర్డర్ సినిమా పని ఖతం..!

Murder Movie : వర్మకు షాక్. మర్డర్ సినిమా పని ఖతం..!
X
Highlights

Murder Movie Issue In Court : కాంట్రవర్సీ సినిమాలతో కాసులు సంపాదించుకుంటున్న రాంగోపాల్ వర్మ మరోసారి కోర్టు...

Murder Movie Issue In Court : కాంట్రవర్సీ సినిమాలతో కాసులు సంపాదించుకుంటున్న రాంగోపాల్ వర్మ మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. మర్డర్ పేరుతో ఆయన ప్రకటించిన సినిమాపై వివాదం అంతకంతకూ పెరుగుతోంది.

మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. అమృత, ప్రణయ్ ప్రేమ వ్యవహారం, గొడవలు, ప్రణయ్ హత్య, మారుతీరావు ఆత్మహత్యకు సంబంధించిన సన్నివేశాలను సినిమాలో చూపించేచ ఛాన్స్ ఉంది.

అయితే. సినిమా పేరు ప్రకటించినప్పుడే వివాదం రాజుకుంది. ఫస్ట్ రిలీజ్ చేశాక అది మరింత పెరిగింది. ఆ తర్వాత ట్రైలర్, సాంగ్ కూడా రిలీజ్ చేశాడు వర్మ.

[embed]https://www.youtube.com/watch?v=DFGTOYvX-cw&feature=youtu.be[/embed]

ఫస్ట్ లుక్ వచ్చిన టైంలోనే ప్రణయ్ భార్య అమృత మీడియాలకు ఓ లేఖ రిలీజ్ చేసింది. ప్రశాంతంగా బతుకుతున్న తమను బజారుపడేయొద్దని కోరింది. రాంగోపాల్ వర్మ ఓ వేస్ట్ ఫెల్లో అంటూ ఫుల్లుగా తిట్టేసింది కూడా. అయినా.. వర్మ వెనక్కి తగ్గలేదు.

దీంతో నల్గొండ కోర్టులో అమృత పిటిషన్ వేసింది. సినిమా ప్రమోషన్, రిలీజ్ ఆపేసేలా చర్యలు తీసుకోవాలని కోర్టుకు కోరింది. తన పర్మీషన్ లేకుండా అభ్యంతరకర సన్నివేశాలతో సినిమా తీస్తున్నారని కోర్టుకు తెలిపింది.

కేసు విచారణలోఉన్న సమయంలో ఇలాంటి కథతో సినిమా రావడం సాక్షులపై ప్రభావం చూపుతుందని కోర్టుకు విన్నవించుకుంది అమృత.

పిటిషన్ టేకప్ చేసిన కోర్టు.. మర్డర్ సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్లు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కౌంటర్ వేసేందుకు ఈ నెల 11 వరకు సమయం ఇస్తూ ఆర్డర్స్ ఇచ్చింది.

Next Story
Share it