Subscribe

News, Telangana

నాగబాబు టూ జనసేన.. ఆయింట్ మెంట్ రాసే పనిలో బిజీ..!

nagababu reaction on his gadse comments

జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన గాడ్సేను పొగుడుతూ.. ఇటీవలే ట్వీట్ చేశారు నాగబాబు. ఎవరు ఏమన్నా.. తనకు గాడ్సేను ఆదర్శమంటూ వివరణలు కూడా ఇచ్చుకున్నారు. నాగబాబు కామెంట్స్ పై చాలామంది సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఫుల్లుగా దుమ్ముదులిపారు.

ఇది నాగబాబు ఒక్కడితో ఆగలేదు. నాగబాబు ఒంటరి కూడా కాదు. తమ్ముడు పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో చురుగ్గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు.

ఇలాంటి పరిస్థితిలో గాడ్సేపై నాగబాబు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. నాగబాబు అభిప్రాయమే జనసేన అభిప్రాయమా..? అంటూ సోషల్ మీడియాలో చాలామంది సీరియస్ అయ్యారు. జాతిపితను హాతమార్చిన వాడిని జనసేన పొగుడుతోందా..? అని ఫుల్లుగా వేసుకున్నారు.

దీంతో ఆయింట్ మెంట్ రాసే పనులు మొదలుపెట్టారు నాగబాబు. తన వ్యాఖ్యలతో జనసేనకు ఎలాంటి సంబంధం లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. అదిపూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని.. జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ట్విట్ చేశారు.

అక్కడితే ఆగలేదు నాగబాబు. ఇప్పుడు వేధాంతం వళ్లె వేస్తున్నారు. కప్ప, కొంగ సిద్ధాంతాన్ని చాటి చెబుతున్నారు. కొందరికి నిజాన్ని మింగడం కష్టంగా మారిందంటున్నారు. సత్యం వధ.. ధర్మం చెర అంటూ.. వేధాంతాలు చెబుతున్నారు.

(Visited 7 times, 1 visits today)