Top
Batukamma

Nani V movie : సినిమాలో మ్యాటర్ లేదు సరే.. ప్రాఫిట్స్ మాటేమిటి..?

Nani V movie : సినిమాలో మ్యాటర్ లేదు సరే.. ప్రాఫిట్స్ మాటేమిటి..?
X
Highlights

నాని 25వ మూవీ వి, అమెజాన్ ప్రైమ్ కు కూడా ఈ మూవీ వల్ల పెద్దగా ప్రాఫిట్స్ ఏమీ రాలేదని చెబుతున్నారు.

Nani V movie profit : నేచురల్ స్టార్ నాని 25వ మూవీ 'వి' పై పబ్లిక్ చాలా వరకు నెగెటివ్ టాక్ వచ్చింది. సుధీర్ బాబు, అదితిరావు హైదరి, నివేదా థామస్ తో కలిపి ఓ మల్టీ స్టారర్ లాగా సినిమాను తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్‌, హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5న విడుదల చేసిన సంగతి తెలిసిందే.

థియేటర్లు మూతపడిన సమయంలో OTT ప్లాట్ ఫాంలో రిలీజైన ఓ బిగ్ మూవీగా “వి” రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ పబ్లిక్ లో పాజిటివ్ టాక్ మాత్రం రాలేదు. దీంతో ఈ సినిమాని దిల్ రాజు కావాలని వదిలించుకున్నాడని ప్రచారం మీడియాలో ఓ రేంజిలో జరిగింది. దిల్ రాజు ముందే ఈ సినిమా ప్లాఫ్ అని ఊహించాడని అన్నారు.

Image

అమెజాన్ ప్రైమ్ కు కూడా ఈ మూవీ వల్ల పెద్దగా ప్రాఫిట్స్ ఏమీ రాలేదని చెబుతున్నారు. అయితే.. నిర్మాత దిల్ రాజు మాత్రం.. ఈ మూవీతో ఓ పది కోట్ల వరకు లాభపడినట్టు తెలుస్తోంది.

OTT రైట్స్ (అమేజాన్ ప్రైమ్) - రూ 31 కోట్లు, శాటిలైట్ (జెమినీ) - రూ. 8 కోట్లు, హిందీ డబ్బింగ్ - రూ. 7 కోట్లు

మొత్తం రెవిన్యూ: రూ. 46 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది.

ఇక ఖర్చుల విషయానికొస్తే.. పెట్టుబడి: రూ. 33కోట్లు, లాభం: రూ. 13 కోట్లు (46 - 33 = 13), వడ్డీలు: 3 కోట్లు తీసేస్తే ఫైనట్ గా 10 కోట్ల ప్రాఫిట్ వచ్చినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి :

Next Story
Share it