Top
Batukamma

షాకింగ్ వీడియో : నడిరోడ్డుపై యువతి దారుణ హత్య

షాకింగ్ వీడియో : నడిరోడ్డుపై యువతి దారుణ హత్య
X
Highlights

రోజురోజుకు మహిళలల పైన అత్యాచారాలు, అఘాయిత్యాలు  పెరుగుతున్నాయి, దిశా, నిర్భయ చట్టాలు వచ్చినప్పటికీ ఎవరు కూడా భయపడడం లేదు.. తాజాగా నిఖిత(21) అనే  ఓ అమ్మాయిని తౌసీఫ్ అనే వ్యక్తి నడిరోడ్డు పైన అందరూ చూస్తుండగానే కాల్చి చంపేశాడు

రోజురోజుకు మహిళలల పైన అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరుగుతున్నాయి, దిశా, నిర్భయ చట్టాలు వచ్చినప్పటికీ ఎవరు కూడా భయపడడం లేదు.. తాజాగా నిఖిత(21) అనే ఓ అమ్మాయిని తౌసీఫ్ అనే వ్యక్తి నడిరోడ్డు పైన అందరూ చూస్తుండగానే కాల్చి చంపేశాడు.

దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమరాలో రికార్డు అయ్యాయి.. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకోగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మతం మారేందుకు నిరాకరించిందన్న ఆగ్రహంతో నిఖితను తౌసీఫ్ చంపెసినట్టుగా తెలుస్తోంది.

నిఖిత పరీక్ష రాసి వస్తుండగా దుండగలు అక్కడ మాటు వేశారు. అయితే అక్కడికి నిఖిత రాగానే ముందుగా ఆమెను కారులో కిడ్నాప్ చేయాలని ప్రయత్నం చేశారు.అయితే దీనికి నిఖిత ప్రతిఘటించింది కూడా..మద్యలో నిఖిత ఫ్రెండ్ కూడా కాసేపు అడ్డుకోవడంతో తుపాకీతో కాల్పులు జరిపాడు తౌసీఫ్ .

దీనితో నిఖిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన పైన బాధితురాలు కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వెంటనే తౌసీఫ్ ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇక నిఖితను ఇస్లాం మతంలోకి మారమని తౌసీఫ్ ఫోర్స్ చేశాడని కానీ అందుకు నిఖిత ఒప్పుకోక పోవడంతో ఆమెను చంపేశాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. గతంలో తౌసీఫ్ పైన నిఖిత తండ్రి పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు కూడా..



Next Story
Share it