Top
Batukamma

1200 కోట్లతో భారీ హనుమంతుడి విగ్రహం.. ఎక్కడంటే..?

1200 కోట్లతో భారీ హనుమంతుడి విగ్రహం.. ఎక్కడంటే..?
X
Highlights

అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతోంది. అక్కడే 225 అడుగుల రాముడి విగ్రహాన్ని పెట్టనున్నారు.

Tallest Hanuman Statue: దేశంలో మరో భారీ విగ్రహ నిర్మాణం ప్రారంభం కాబోతోంది. 215 అడుగుల ఎత్తుతో.. దాదాపు 1200 కోట్ల రూపాయల ఖర్చుతో భారీ హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.

కర్ణాటకలోకి హంపిలో దీనిని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం హంపి సమీపంలోని కిష్కింద 10 ఎకరాల స్థలం కొనుగోలు చేస్తున్నారు. కిష్కిందను వానరసేనకు రాజధానిగా భావిస్తారు. అందుకే అక్కడే భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.

ఇప్పటికే అయోధ్యలో భారీ రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతోంది. అక్కడే 225 అడుగుల రాముడి విగ్రహాన్ని పెట్టనున్నారు.

అయితే.. రాముడి విగ్రహం కంటే హనుమంతుడి విగ్రహం పెద్దగా ఉండొద్దనే ఉద్దేశంతో 215 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నిర్వాహకులు. దీనిని రాగితో నిర్మించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

భారీ విగ్రహ నిర్మాణం(Tallest Hanuman Statue) కోసం విరాళాలు సేకరిస్తామన్నారు. దీనికోసం దేశ వ్యాప్తంగా రథయాత్ర చేపట్టనున్నట్టు చెప్పారు.

- 17-11-2020 మంగళవారం నేటి రాశిఫలాలు

- TRS- కిషన్ రెడ్డి చీకటి దోస్తీ...! చిట్టా విప్పిన రేవంత్ రెడ్డి.Next Story
Share it