ఖుష్బూ పొగరు మాటలు.. 6 నెలల జైలు తప్పదా..?

సినీనటి, బీజేపీ నేత ఖుష్బూ పైన తాజాగా యాభై పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు నమోదయ్యాయి..
సినీనటి, బీజేపీ నేత ఖుష్బూ పైన తాజాగా యాభై పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.. తాజాగా ఆమె కాంగ్రెస్ ను వీడి, బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే.
అయితే ఆమె బీజేపీలో చేరిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పైన, నేతల పైన పలు వివాదాస్పద కామెంట్లు చేశారు. దీనితో ఆమెపై మొత్తం 50 పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.
ఇంతకీ ఖుష్బూ ఏమన్నారంటే..కాంగ్రెస్‌కు మేధో వైకల్యం ఏర్పడిందని, ఆ పార్టీ నేతలు మానసిక వికలాంగులంటూ ఖుష్బూ విమర్శలు చేశారు..తాను "మానసిక వికలాంగుల" పార్టీ నుండి బయటకు వచ్చానని చెప్పారు.
అయితే ఆమె వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన తమిళనాడు అసోషియేషన్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ కేర్ గివర్స్ అనే దివ్యాంగుల హక్కుల సంఘం మొత్తం 50 పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేశారు.
చెన్నై, కాంజీపురం, చెంగల్‌పేట, మదురై, కోయంబత్తూర్, తిరుపూర్ వంటి ప్రాంతాల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి.
అయితే దీనిపైన స్పందించిన ఖుష్బూ క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటనను విడుదల చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని,బాధలో రెండు తప్పుడు పదాలను వాడానని క్షమాపణలు కోరారు.
అయితే ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను క్షమించేది లేదని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ సంఘం డిమాండ్ చేస్తోంది.
చట్టప్రకారం ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను సుమారుగా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.