రెచ్చిపోయిన కామాంధులు.. 50 ఏళ్ల మహిళను రేప్ చేసి.. పక్కటెముకలు విరగ్గొట్టి..

ప్రైవేట్ పార్ట్స్ పైన దాడి చేసి పక్కటెముకలు, కాళ్లు విరగొట్టారు. గత ఆదివారం జరిగిన ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హథ్రాస్ ఘటన మరవకముందే యూపీలో మరో దారుణం చోటు చేసుకుంది. నడి వయస్కురాలైన మహిళపై కామాంధులు రెచ్చిపోయారు. మహిళా పైన సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా అతి కిరాతకంగా ప్రవర్తించారు.ప్రైవేట్ పార్ట్స్ పైన దాడి చేసి పక్కటెముకలు, కాళ్లు విరగొట్టారు. గత ఆదివారం జరిగిన ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బదౌన్ జిల్లాలోని ఉగైతీ ప్రాంతంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న ఓ 50 ఏళ్ల మహిళా.. ఈ నెల మూడో తేదిన సాయంత్రం స్థానిక ఆలయానికి వెళ్ళింది. అయితే ఆమె ఎంత టైంకి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలిసుల విచారణలో భాగంగా మహిళా శవం ఓ బావిలో దొరికింది.
అయితే ఆమె మృతదేహానికి పోస్ట్మార్టం జరిపించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితులు సదరు మహిళా పైన సామూహిక అత్యాచారానికి పాల్పడడంతో పాటు.. ప్రైవేటు భాగాల్లో ఐరన్ రాడ్డుతో దాడి చేశారు. పక్కటెముకలు, కాలు విరిగేలా పశువుల్లా ప్రవర్తించారు. అంతేకాకుండా తలపైన కూడా గాయాలు అయ్యాయి. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆలయ పూజారిని, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.