ప్రియురాలు కోసం బాబా వేషం.. స్థానికుల చేతిలో చావు దెబ్బలు!

ప్రియురాలు కోసం బాబా అవతారం ఎత్తాడు ఓ ప్రియుడు.. అయితే వేషం మొదట్లోనే బెడిసికొట్టడంతో స్థానికుల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు.
ప్రియురాలు కోసం బాబా అవతారం ఎత్తాడు ఓ ప్రియుడు.. అయితే వేషం మొదట్లోనే బెడిసికొట్టడంతో స్థానికుల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. ఈ ఘటన భువనేశ్వర్ లోని జాజ్‌పూర్ రోడ్ ఫెర్రో క్రోమ్ గేటు కాలనీలో శనివారం చోటుచేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాబా వేషంలో మనోడు అంగుల్‌లో 12వ తరగతి చదువుతున్న ఓ అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి ఇంట్లో విషయం తెలియడంతో వీరి ప్రేమని నిరాకరించారు. దీనితో ప్రియురాలు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అని బాబా వేషం వేసుకున్నాడు.
ప్రియురాలి ఇంటి పరిసరాల్లో బాబా వేషం వేసుకొని తిరుగుతుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పిల్లల దొంగగా భావించి పట్టుకుని నిలదీశారు. ముందుగా తాను హిమాలయాల నుంచి వచ్చినట్లుగా బుకాయించాడు.
అతని పొంతని లేని సమాధానాలను నమ్మని స్థానికులు సందేహంతో గడ్డం లాగడంతో మనోడి కథ మొత్తం బయటకు వచ్చింది. దీనితో ఆ దొంగ బాబాను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు