Top
Batukamma

ఖాళీ సిలిండర్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి..!

ఖాళీ సిలిండర్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి..!
X
Highlights

గ్యాస్ సిలిండర్‌ ధరను క్రమంగా పెంచుకుంటూ వెలితే సబ్సిడీ భారం తగ్గించుకోవచ్చని కేంద్రంలోని మోడీ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఓ బ్రేకింగ్ న్యూస్.. ఇంట్లో ఖాళీ సిలిండర్ ఉందా.? తర్వాత బుక్ చేద్దాంలే అని అలాగే ఉంచేశారా..? అయితే వెంటనే మీ నిర్ణయాన్ని మార్చుకోండి. సిలిండర్ బుక్ చేసుకోండి. ఎందుకంటే త్వరలోనే మరోసారి గ్యాస్ ధర పెరిగే అవకాశముందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

పెట్రోలియం సబ్సిడీని కేంద్ర ఆర్థిక శాఖ.. భారీగా తగ్గించడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆర్థిక శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరానికి పెట్రోలియం సబ్సిడీ రూ.12,995 కోట్లకు కోత పెట్టింది. అంటే గ్యాస్ సిలిండర్‌ ధరను క్రమంగా పెంచుకుంటూ వెలితే సబ్సిడీ భారం తగ్గించుకోవచ్చని కేంద్రంలోని మోడీ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫ్యూచర్ లో గ్యాస్ సబ్సిడీని పూర్తిగా ఎత్తేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్థిక శాఖ అధికారులు ఈ అంశాన్ని ధృవీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే క్రమంగా గ్యాస్ ధరను పెంచుతూ పోతారని అంటున్నారు. 2021-22 తో పాటు 2022-23లోనూ ధరల పెరుగుదల కంటిన్యూ అవుతుందని అధికారులు అంటున్నారు.

Next Story
Share it