Top
Batukamma

కూకట్‌పల్లి అత్యాచారం కేసులో ట్విస్టు.. ఆ లాడ్జ్ లోనే ఇదంతా!

కూకట్‌పల్లి అత్యాచారం కేసులో ట్విస్టు.. ఆ లాడ్జ్ లోనే ఇదంతా!
X
Highlights

ఈ అత్యాచారం చేసిన ముగ్గరు కూడా మేజర్లని పోలీసులు తేల్చేశారు. నిందితులు జోసెఫ్‌, రాము, న‌వీన్‌లపై కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం వారిని విచారణ చేస్తున్నారు.

జూబ్లీహిల్స్ కి చెందిన ఓ యువతిని(19) మత్తుమందు ఇచ్చి ముగ్గరు యువకులు అత్యాచారం చేసిన ఘటనలో మరో ట్విస్ట్ ఏర్పడింది. ఈ అత్యాచారం చేసిన ముగ్గరు కూడా మేజర్లని పోలీసులు తేల్చేశారు. నిందితులు జోసెఫ్‌, రాము, న‌వీన్‌లపై కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం వారిని విచారణ చేస్తున్నారు.

అయితే ఈ ముగ్గురు యువకులు సదరు యువతిని కూకట్‌పల్లిలోని ఓయో ఆనంద ఇన్‌ హోటల్ కు తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్టుగా పోలిసుల విచారణలో తేలింది. ఈ ముగ్గురు నిందితులకి ఓయో ఆనంద ఇన్‌ హోటల్ నిర్వాహకులు ముందుగానే ఓ ప్రత్యేక గదిని కేటాయించినట్టుగా విచారణలో తెలిసింది.

ఇప్పుడని కాదు.. గతంలో లైగింక దాడి, హింసా ఘటనలు కూడా చోటుచేసుకున్నప్పటికి సదరు హోటల్ వ్యవహారంలో ఎలాంటి మార్పులు రాలేదు.. అడిగితే విచ్చలవిడిగా అద్దెకు గదులు ఇచ్చేయడం, వారి వెంటే అమ్మాయిలు ఉన్న చూసిచూడనట్టుగా వదిలేయడం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఈ హోటల్ మారిందని స్థానికులు అంటున్నారు.

అయితే విచారణలో ఈ హోటల్ గురించి తెలియడంతో మీడియా అక్కడికి చేరుకోగానే ఓ జంట అక్కడ నుంచి పరారైంది. ప్రస్తుతం పోలీసులు ఓయో హోటల్ నిర్వాహకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక ఈ కేసులోని బాధితురాలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది.

కానీ ఆమెతో పాటుగా ఆమె కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. వారికోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. భాదితురాలు సికింద్రాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతుంది. అటు ఈ కేసును జూబ్లీహిల్స్ పోలీసులు కూకట్‌పల్లికి షిఫ్ట్ చేశారు.

Next Story
Share it