జ్యోతిష్యుడు చెప్పాడని మొగుడినే వదిలేసిందట..!

కొందరు పెళ్లాం పిల్లలు లేని వాళ్లు.. ఇతరుల కుటుంబాలను కూల్చి సంతోషిస్తున్నారు.
Astrologer convinced Sujata Mondal To change party : సాధారణంగా రోజువారీ జీవితంలో చాలా మంది భార్యభర్తల గొడవలు చూస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఇవి విడాకుల దాకా వెళ్తాయి. అయితే.. ఇందులో ఆ జంట ఆవేశం, రెండు కుటుంబాల పెద్దల తొందరపాటు కూడా ఉంటుంది.
అయితే.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఓ విడాకుల కేసు కథ మాత్రం మరోలా ఉంది. జ్యోతిష్యుడు చెప్పాడని ఏకంగా మొగుడికి విడాకులు ఇచ్చింది ఓ రాజకీయ నాయకురాలు.
ఆమెనే ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన సుజాత మోండల్(Sujata Mondal). ఆమె భర్త బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్. ఈ సోమవారం రోజున ఆమె బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్(Trinamool Congress) లో చేరింది.
అయితే.. ఆమె భర్త సౌమిత్రాఖాన్(Saumitra Khan) బీజేపీలో ఉన్నారు. బెంగాల్ లో బీజేపీ దూసుకుపోతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని ఆల్రెడీ అమిత్ షా కన్ఫామ్ చేసేశారు. ఇలాంటి టైంలో సుజాత మోండల్ పార్టీ మారడం ఏంటని అంతా అనుకున్నారు.
ఆమె పార్టీ మారడం వెనకున్న అసలు కథను బయటపెట్టారు ఆమె భర్త, బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్. పార్టీ మారితే చాలా పెద్ద పదవి వస్తుందని ఓ జ్యోతిష్యుడు(astrologer) ఆమెకు చెప్పాడట. టాప్ పొజిషన్ లోకి వెళ్తావని ఆ జ్యోతిష్యుడు నమ్మబలికాడట. అందుకే ఆమె మమత బెనర్జీ పార్టీలో చేరిందట.
అయితే.. సౌమిత్రా ఖాన్ మాత్రం... దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యి ఏకంగా విడాకుల నోటీసు పంపించారు. తృణమూల్ కాంగ్రెస్(TMC) తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిందని ఆరోపించాడు. తన కుటుంబలక్ష్మీదేవిని TMC ఎత్తుకెల్లిందని ఫైర్ అయ్యాడు.
"నా కుటుంబలక్ష్మీదేవిని టీఎంసీ ఎత్తుకెళ్లింది. ఆమె ఏం పోస్ట్ ఇస్తారో తెలియదు. సీఎం ను చేస్తారేమో.. కానీ నేను కోరేది ఒక్కటే.. ఖాన్ అనే ఇంటిపేరు వాడటం మానేయాలి.." అని చెప్పారు సౌమిత్రి ఖాన్.
దీనిపై సుజాత మోండల్ సీరియస్ గానే రియాక్ట్ అయ్యింది. "నేను విడాకులు కోరుకోవడం లేదు..
అతడిని ఎవరు ఇలా మాట్లాడిస్తున్నారో నాకు తెలుసు.. కొందరు పెళ్లాం పిల్లలు లేని వాళ్లు.. ఇతరుల కుటుంబాలను కూల్చి సంతోషిస్తున్నారు. మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా ట్రిపుల్ తలాక్ చట్టంచేసిన బీజేపీ(bjp)కి చెందిన నేత.. నాకు విడాకుల నోటీసు పంపించాడు.. భార్యభర్తలు రెండు పార్టీల్లో ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. నేను నా పేరుతోనే ముందుకెళ్తా.. నాకు నా భర్త పేరు, తండ్రి పేరు అవసరం లేదు.." అంటూ కౌంటర్ ఇచ్చారు.
జ్యోతిష్యుడు చెప్పాడని చేసిందో... తృణమూల్ లో మంచి పదవి వస్తుందని అటు వెళ్లిందో తెలియదు కానీ.. ఇప్పుడు సుజూత మోండల్ ఇష్యూ మాత్రం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
- రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం!
- Horoscope Telugu Today : 23-12-2020 బుధవారం నేటి పంచాంగం, రాశిఫలాలు