Top
Batukamma

భర్తకు ప్రేయసితో పెళ్లి చేసిన భార్య.. భర్త కోసం భారీ త్యాగం..!

భర్తకు ప్రేయసితో పెళ్లి చేసిన భార్య..  భర్త కోసం భారీ త్యాగం..!
X
Highlights

తెలుగులో వచ్చిన కన్యాదానం సినిమా మాదిరిగానే ఇక్కడ కూడా జరిగింది. అయితే ఇదేదో విదేశాల్లో కాదు. భోపాల్ లో ఈ ఘటన జరిగింది.

Bhopal Wife helps husband get married to his girlfriend:

వినడానికి విడ్డూరంగా ఉన్న మీరు చదివింది నిజమే. ఓ భార్య తన భర్తకు మరో మహిళతో పెళ్లి చేసింది. తెలుగులో వచ్చిన కన్యాదానం సినిమా మాదిరిగానే ఇక్కడ కూడా జరిగింది. అయితే ఇదేదో విదేశాల్లో కాదు. మన దేశంలోనే. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఈ ఘటన జరిగింది.

భోపాల్ కు చెందిన ఓ వ్యక్తికి మూడేళ్ల క్రితం పెళ్లయింది. అప్పటికే అతనికి వేరే అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పెళ్లయ్యాక ఆమెను దూరం పెట్టాడు. భార్యతో కలివిడిగా ఉన్నాడు. భార్యా భర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇద్దరు అన్యోన్యంగానే ఉంటున్నారు.

అయితే.. వీళ్లిద్దరి కాపురం బాగానే ఉన్నా.. అతగాడిని ప్రేమించిన యువతి మాత్రం విరహ వేదనతో అల్లాడిపోయింది. తన ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో పట్టుబట్టింది. ఇదే విషయాన్ని అప్పటికే పెళ్లైన తన ప్రియుడికి కూడా చెప్పింది.

ఇటు ప్రేమగా ఉంటున్న భార్యను వదల్లేక.. తనే కావాలని కోరుకుంటున్న ప్రేయసిని వదిలి ఉండలేక కొద్దిరోజులు ఇబ్బంది పడ్డాడు ఆ వ్యక్తి. చివరకు తన ప్రేయసిని తీసుకుని ఓ లాయర్ దగ్గరకు వెళ్లాడు. తనకు తన భార్య, ప్రియురాలు.. ఇద్దరు కావాలని.. ఇద్దరితో ఉండాలని అనుకుంటున్నానని చెప్పాడు.

అతని ప్రేయసి మాత్రం దీనికి ఒప్పుకోలేదు. భార్యకు విడాకులు ఇవ్వాల్సిందేనని చెప్పింది. కానీ అతనికి విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు. ప్రేయసిని కూడా పెళ్లి చేసుకుని ముగ్గురు కలిసే ఉండాలనే ఆలోచనలో ఉన్నాడు. అయితే.. అతని వాదన విన్న లాయర్... ఓ సారి అతని భార్యను కూడా పిలిపించి మాట్లాడింది.

సాధారణంగా ఇలా భర్తకు ఆల్రెడీ ఓ లవర్ ఉందనే విషయం తెలిస్తే ఏ భార్య కూడా ఊరుకోదు. తన స్థానంలో మరొకరిని ఏ మహిళ ఊహించుకోదు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. భర్తను చితగ్గొడుతుంది.

కానీ భోపాల్ కు చెందిన ఈ మహిళ మాత్రం అలా చేయలేదు. లాయర్ తో మాట్లాడిన తర్వాత ఒక రోజు సమయం కావాలని అడిగింది. ఆ తర్వాత వచ్చి.. తన నిర్ణయాన్ని వెల్లడించింది. భర్త మనసులో ప్రేయసి ఉన్నప్పుడు.. తాను ఇంట్లో ఉండటం సరి కాదని లాయర్ తో చెప్పింది. తాము ఇన్ని రోజులు ఎలాంటి గొడవల్లేకుండా ఉన్నామని.. అయినా.. అతని మనసులో మరో అమ్మాయికి స్థానం ఉన్నప్పుడు తాను ఇంట్లో ఉండటం అర్థం లేని పని అవుతుందని లాయర్ తో చెప్పింది.

వెంటనే కోర్టులో విడాకుల కోసం పిటిషన్ పెట్టుకుంది. ఇద్దరి అంగీకారంతో వీరికి విడాకులు మంజూరయ్యాయి. అయితే.. భర్త నుంచి ఎలాంటి పరిహారం కూడా తీసుకోలేదు ఆ మహిళ. అతని మనసులో తాను లేనప్పుడు అతని నుంచి పరిహారం తీసుకోవడం కూడా సరికాదని చెప్పింది.

ప్రేయసితో సంతోషంగా ఉండాలని భర్తకు విషెస్ చెప్పి( Bhopal Wife helps husband get married to his girlfriend) తన దారి తాను చూసుకుంది.

ఇప్పుడు ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రేమించిన వారికి కాకుండా వేరేవాళ్లను పెళ్లి చేసుకుని.. ఇబ్బందులు పడే కంటే.. నచ్చిన వారితో ఉండటం మంచిదే కదా అంటున్నారు కొందరు.

మరికొందరు మాత్రం పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు.

- మరోసారి రెచ్చిపోయిన ప్రియా ప్రకాశ్ వారియర్

- వైట్ డ్రెస్ లో హాట్ హాట్ గా అనసూయ!

Next Story
Share it