Top
Batukamma

బిహార్ లో బీజేపీకి షాక్.. మహాకూటమికి పట్టం కట్టిన మెజారిటీ సర్వేలు..!

బిహార్ లో బీజేపీకి షాక్.. మహాకూటమికి పట్టం కట్టిన మెజారిటీ సర్వేలు..!
X
Highlights

టైమ్స్ నౌ, రిపబ్లిక్, ఏబీపీ ఛానళ్ల సర్వేలో మహా కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Bihar Exit Polls 2020: అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ఎన్డీఏ సర్కారుకు షాకిచ్చేలా కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాలా వరకు ఆర్జేడీ, కాంగ్రెస్ తో కూడిన మహా కూటమికే పట్టం కడుతున్నాయి. స్వల్ప సీట్ల తేడాతో మహా కూటమే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని చాలా సంస్థలు చెబుతున్నాయి.

పీపుల్స్ పల్స్-పీఎస్జీ సంస్థ సర్వే ప్రకారం.. ఆర్జేడీకి 85-95, కాంగ్రెస్ 15-20, వామపక్షాలు 3-5 సీట్లు వచ్చే ఛాన్సుంది. ఇక బీజేపీకి 65-75, జేడీయూ 25-35 సీట్లు వచ్చే అవకాశముందని పీపుల్స్ పల్స్-పీఎస్జీ సర్వే చెబుతోంది.

ఈ సర్వే ప్రకారం చూస్తే కాంగ్రెస్, జేడీయూలకు భారీ దెబ్బ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బిహార్ అసెంబ్లీలో జేడీయూకు 71 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం అవి 35 లోపే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ కు 27 స్థానాలుండగా.. అవి 20 కంటే తక్కువకు పడిపోయే అవకాశముందని సర్వే చెబుతోంది.

మిషన్ చాణక్య సర్వే ప్రకారం ఎన్డీఏకుక 128, యూపీఏకు 105, ఇతరులకు 10 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది.

టైమ్స్ నౌ సీ ఓటర్ సర్వే మాత్రం పూర్తిగా మహా కూటమికే ఎడ్జ్ ఇచ్చింది. మహా కూటమికి 120 సీట్లు వచ్చే అవకాశముందని చెబుతోంది. ఎన్డీఏకు 116, ఎల్జేపీకి 1, ఇతరులకు 6 సీట్లు మాత్రమే వచ్చే అవకాశముందని అభిప్రాయపడింది.

ఏబీపీ న్యూస్ సర్వేలోనూ ఇలాంటి ఫలితాలే కనిపించాయి. ఎన్డీఏ కూటమికి 104 నుంచి 128, మహా కూటమికి 108 నుంచి 131, ఎల్జేపీ 1-3, ఇతరులు 4-8 సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

బీజేపీ ఆస్థాన సంస్థ రిపబ్లిక్ టీవీ కూడా మహా కూటమికే పట్టం కట్టింది. రిపబ్లిక్- జన్ కీ బాత్ సర్వేలో మహా కూటమికి 118-138 సీట్లు వచ్చే చాన్స్ ఉందని చెబుతోంది. ఇక ఎన్డీఏకు 91 నుంచి 117 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందంటోంది. సీఎం కావాలని ఉవ్విళ్లూరుతున్న చిరాగ్ పాశ్వన్ కు గరిష్టంగా 8 సీట్లు రావచ్చంటోంది.

ఓవరాల్ సినారియో చూస్తే.. బీజేపీ పక్ష ఛానళ్లుగా ముద్ర పడిన టైమ్స్ నౌ, రిపబ్లిక్, ఏబీపీ ఛానళ్ల సర్వేలో(Bihar Exit Polls 2020) మహా కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

- మరోసారి రెచ్చిపోయిన ప్రియా ప్రకాశ్ వారియర్

- మత మార్పిడులపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

Next Story
Share it