Top
Batukamma

ఆపండి.. తాళి కట్టే క్షణంలో వరుడుకి షాక్ ఇచ్చిన వధువు!

ఆపండి.. తాళి కట్టే క్షణంలో వరుడుకి షాక్ ఇచ్చిన వధువు!
X
Highlights

ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు నీలగిరి జిల్లా కోతగిరికి చెందిన ప్రియదర్శినికి నీలగిరి జిల్లాకే చెందిన ఆనంద్ అనే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళికి అన్ని సిద్దం చేశారు..

సరిగ్గా తాళి కట్టే సమయానికి ఆపండి అనే డైలాగ్ మనం చాలా సినిమాల్లో చూసుంటాం.. కానీ ఆ డైలాగ్ బయటవాళ్ళు ఎవరో చెబుతారు.. ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ వింత సంఘటన తమిళనాడులో శనివారం చోటుచేసుకుంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు నీలగిరి జిల్లా కోతగిరికి చెందిన ప్రియదర్శినికి నీలగిరి జిల్లాకే చెందిన ఆనంద్ అనే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళికి అన్ని సిద్దం చేశారు.. మండంపంలో కూడా అన్ని ఉన్నాయి.. ఇక తాళి కట్టడం ఒక్కటే లేటు... మరో నిమిషంలో ఆ తతంగం కూడా అయిపోతుంది అనుకున్న టైంలో ప్లీజ్.. నాకీ పెళ్ళొద్దు అంటూ పెళ్లి కొడుక్కి చెప్పేసింది వధువు.


ఎందుకు.. ఏమైంది సరిగ్గా ఇవే ప్రశ్నలు.. పెళ్లి కొడుకుతో సహా అక్కడికి వచ్చినవాళ్లు అందరూ అడిగారు.. సదరు పెళ్లి కూతురు అప్పటికే ఒకరితో గాడమైన ప్రేమలో ఉందట.. ఇదే విషయాన్ని అందరిముందు చెప్పేసింది. అంతేకాదు తాను ప్రేమించిన వాడు మరో అరగంటలో వస్తాడంటూ చెప్పుకొచ్చింది. దీనితో వరుడుతో సహా అందరూ ఖంగుతిన్నారు.

అలా కాదమ్మా అని బంధువుల జోక్యం చేసుకుని సర్దిచెప్పే పని పెట్టుకున్నారు కూడా.. పెళ్ళికి వచ్చిన ఓ పెద్దావిడ అయితే మరింత జోక్యం చేసుకుని వధువుని ఒప్పిద్దాం అనుకుంది.. కానీ ఆ వధువు ఆ పెద్దావిడకే ఎదురు తిరిగింది. ఇదంతా ఏంటో అర్ధం కాక వరుడు అక్కడినుంచి లేచి వెళ్ళిపోయాడు.

అయితే ఆమె చెప్పిన ప్రియుడు అర్ధగంటకి వస్తే ఆ పెళ్లి అయిన చూసి నాలుగు అక్షింతలు వేసి పోదాం అనుకుంటే అతగాడు అర్ధగంట కాదు కదా ఆరు గంటల అయినా రాలేదు.. దీనితో ఓపిక లేక బంధువులు ఎవరింటికి వారు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Next Story
Share it