Top
Batukamma

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్.. ఎంతంటే..?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్.. ఎంతంటే..?
X
Highlights

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్ చెప్పింది. పండగ పూట ఉద్యోగులకు ఖుషీ చేసింది. దాదాపు...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్ చెప్పింది. పండగ పూట ఉద్యోగులకు ఖుషీ చేసింది. దాదాపు 30.67 లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు బోనస్ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్, నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది సెంట్రల్ కేబినెట్. 2019-20 సంవత్సరానికి గాను ఈ మొత్తాన్ని చెల్లించనున్నారు. 30.67 లక్షల మంది ఉద్యోగులకు

3,737 కోట్ల రూపాయలు బోనస్ గా చెల్లించనున్నారు.

ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ 19.97 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు అందనుంది. ఇందులో రైల్వే, పోస్టల్, డిఫెన్స్, ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ వంటి వాటిల్లో పనిచేసే ఉద్యోగులున్నారు.

నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ 13.70 లక్షల మంది నాన్ గెజిటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు అందనుంది. దసరాకు ముందే సింగిల్ ఇన్ స్టాల్ మెంట్ లో ఈ అమౌంట్ ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది.

అయితే.. కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు షాకిచ్చింది. అన్ని డిపార్ట్ మెంట్ల ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టింది. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు అప్పట్లో కోత విధించింది. ఇప్పుడు వారిని ఖుషీ చేసేందుకు బోనస్ ప్రకటించింది. దీని ద్వారా ఉద్యోగుల్లో ఉత్సాహం పెరిగి.. ఉత్పాదకత కూడా పెరుగుతుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Next Story
Share it