Top
Batukamma

వ్యాక్సిన్ పేరుతో మోసం చేసిన కేంద్ర సర్కారు..!?

వ్యాక్సిన్ పేరుతో మోసం చేసిన కేంద్ర సర్కారు..!?
X
Highlights

ప్రతీది రాజకీయం కోసమే మాట్లాడతాడు తప్ప.. జనం కోసం కాదని మరోసారి రుజువుచేసింది కేంద్ర ప్రభుత్వం.

Central Government Fake Promise Over Corona Vaccine: కేంద్రంలో ఉన్న మోడీ(modi) సర్కారు మరోసారి దేశ ప్రజలకు హ్యాండిచ్చింది. అది చేస్తాం.. ఇది చేస్తాం అని చెప్పి.. జనాల్లో ఆశలు రేకెత్తించిన కేంద్రం.. ఇప్పుడు తుస్సుమనిపించింది.

రాజకీయ నాయకుడంటే.. ప్రతీది రాజకీయం కోసమే మాట్లాడతాడు తప్ప.. జనం కోసం కాదని మరోసారి రుజువుచేసింది కేంద్ర ప్రభుత్వం.

కరోనా (corona) దెబ్బతో అల్లాడుతున్న దేశం.. ప్రపంచం.. ఇప్పుడు వ్యాక్సిన్(vaccine) కోసం ఎదురుచూస్తున్నాయి. ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందో.. తాము ఎప్పుడు.. ఈ మహమ్మారి నుంచి బయటపడతామోనని ఆశతో, ఆందోళనతో ఎదురుచూస్తున్నారు జనం.

- బిగ్ బాస్ ఓట్లకి, GHMC ఎలక్షన్స్ కి పోలిక ఉందా..?

- 02-12-2020 బుధవారం రాశిఫలాలు

- ఛీ..ఛీ.. రాష్ట్రంలో బీజేపీ మరీ ఇంత దిగజారిందా?


ప్రజల ఆశను క్యాష్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. బిహార్(bihar) లో ప్రజలందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేస్తామని హామీ ఇచ్చింది. ఇటు గ్రేటర్ హైదరాబాద్(ghmc) ఎన్నికల్లోనూ ఉచిత వ్యాక్సిన్ అంటూ మరోసారి హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో కేంద్ర నియమనిబంధనల ప్రకారం వ్యాక్సిన్ అని రాసి.. నేతలు బయటకు చెప్పడం మాత్రం ఫ్రీగా వ్యాక్సిన్ అంటూ ప్రచారం చేశారు.

అక్కడితో ఆగలేదు. వ్యాక్సిన్ రివ్యూ అంటూ భారత్ బయోటెక్ ల్యాబ్(bharath biotech), సిరం ల్యాబ్(serum lab), జైడస్ ల్యాబ్(zydus) కు స్వయంగా వెళ్లి పరిశీలించారు మోడీ. త్వరగా వ్యాక్సిన్ తీసుకురావాలని.. కేంద్రం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని చెప్పారు.


ఇదుగో వ్యాక్సిన్.. అదుగో వ్యాక్సిన్.. రెండు మూడు నెలల్లో వచ్చేస్తోంది. దేశంలోని ప్రజలందరికి వ్యాక్సిన్ సప్లై ఇవ్వడానికి మా దగ్గర ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయంటూ ప్రకటనలు వచ్చాయి.

కానీ.. ఇప్పుడు వ్యాక్సిన్ విషయంలో సర్కారు మాట మార్చింది. దేశప్రజలందరికి వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. స్వయంగా కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్(Rajesh bhushan) ఈ విషయం చెప్పారు. అంతేకాదు.. దేశంలో ఉన్నవారందరికి వ్యాక్సిన్ ఇస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదంటూ ఓ మాట చెప్పారు.

మరి.. బిహార్ లో, హైదరాబాద్ లో మేనిఫెస్టోలో పెట్టి మరీ వ్యాక్సిన్ ఫ్రీగా.. అందరికి ఇస్తామని చెప్పిన బీజేపీవి జూటా మాటలే కదా. వ్యాక్సిన్ పేరుతో బ్లాక్ మెయిల్ చేసి ఓటేయించుకున్నట్టే కదా.!


నిజమే కరోనా వ్యాక్సిన్ రెడీ అవ్వగానే మొదట కరోనా వారియర్స్ కే ఇస్తామని చాలా దేశాలు ప్రకటించారు. హెల్త్ కేర్ సిబ్బంది. పోలీసులు, ఆర్మీ(army), బలగాలతో పాటు 50 ఏళ్లు పైబడిన వారు. 50 ఏళ్ల లోపు ఉండి.. దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి వ్యాక్సిన్ ఇస్తామని చాలా దేశాలు అనౌన్స్ చేశాయి.

కానీ మన దేశంలో ఎన్నికలు రాగానే అందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామంటూ ఫేక్ హామీలిచ్చారు నేతలు. విపత్తుని, వ్యాక్సిన్ ని కూడా తమ రాజకీయాల కోసం వాడుకున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(bjp) పెద్దలు. కరోనా తర్వాత జరిగిన ఎన్నికల జరిగిన రెండు చోట్ల వ్యాక్సిన్ హామీ ఇచ్చారు.

త్వరలో మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ కూడా ఇలాంటి హామీలే ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రజలు ఆలోచించనంత వరకు.. పాలకులు ఇలాంటి జూటా హామీలు ఇస్తూనే ఉంటారు.

- ఈ కోమలి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!

- ఆన్ లైన్ లో హాట్ టాపిక్ అయిన త్రిదా చౌదరి..!

- చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తున్న జబర్దస్త్ పోరి!

Next Story
Share it