మత మార్పిడులపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మతాంతర ప్రేమ వివాహాలు చేసుకునే వారికి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
Allahabad High Court: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మతాంతర ప్రేమ వివాహాలు చేసుకునే వారికి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
ఎందుకంటే.. పెళ్లి కోసమే మత మార్పిడి జరిగితే.. అది చట్టంబద్దం కాదని తేల్చి చెప్పింది అలహాబాద్ హైకోర్టు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పింది.
పెళ్లి తర్వాత రక్షణ కల్పించాలని ఓ జంట కోర్టును ఆశ్రయించింది. ఈ ఇష్యూలో కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసులో తాము జోక్యం చేసుకోలేమని మొదట కోర్టు చెప్పింది. తర్వాత మరోసారి పరిశీలించిన ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది.
ఓ ముస్లిం యువతి, హిందూ యువకుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి కోసం ఆమె హిందూమతాన్ని స్వీకరించింది. ఇది నచ్చని ఆమె బంధువులు దాడికి ప్రయత్నించారు. దీంతో ప్రొటెక్షన్ కావాలని ఆ జంట కోర్టును ఆశ్రయించింది.
అయితే.. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు.. మతమార్పిడి అంశంపై స్పందించింది. సదరు యువతి పెళ్లికి సరిగ్గా రెండు రోజుల ముందే హిందూమతం స్వీకరించినట్టు కోర్టుకు తెలిపింది. ఈ పాయింట్ ను కోర్టు సీరియస్ గా తీసుకుంది. పెళ్లి కోసమే జరిగే మతమార్పిడులను ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పింది.
గతంలో ఇలాంటి తీర్పే ఇచ్చింది కోర్టు(Allahabad High Court). 2014లో ఓ హిందూ యువతి పెళ్లి కోసమే ఇస్లాం మతాన్ని స్వీకరించింది. అప్పట్లో ఈ ఇష్యూ కూడా కోర్టుకు వచ్చింది. దీనిపై అప్పటి న్యాయమూర్తి ఇలాంటి తీర్పే ఇచ్చారు.
మతంపై అవగాహన లేకుండా.. నమ్మకం లేకుండా.. ఆచార వ్యవహారాలు తెలియకుండా.. కేవలం పెళ్లి కోసమే మతం మారడం చట్ట విరుద్ధమే అవుతుందని కోర్టు కామెంట్ చేసింది.
- పుల్వామా ఘటన వాస్తవాలు బట్టబయలయ్యాయి : మోడీ