Top
Batukamma

Corona in Delhi: ఢిల్లీలో కరోనా విలయతాండవం.. భయంకరంగా పెరిగిన కేసులు

Corona in Delhi: ఢిల్లీలో కరోనా విలయతాండవం..  భయంకరంగా పెరిగిన కేసులు
X
Highlights

ఊహించిన ప్రమాదమే ముంచుకొచ్చింది. అంతా భయపడినట్టే జరుగుతోంది.

Corona cases in delhi:

ఊహించిన ప్రమాదమే ముంచుకొచ్చింది. అంతా భయపడినట్టే జరుగుతోంది. కరోనా వైరస్ ను ప్రజలు లైట్ తీసుకున్నా.. వైరస్ మాత్రం జనాలను లైట్ తీసుకోలేదు. తన పని తాను చేసుకుంటూ పోతోంది.

కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో నిన్న ఒక్క రోజే 48 వేల 285 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. నిన్న 550 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటి వరకు 86 లక్షల 84 వేల 39 మంది కేసులు నమోదయ్యాయి.

మరీ ముఖ్యంగా ఢిల్లీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ సెకండ్ వేవ్ దాటిపోయి.. థర్డ్ వేవ్ మొదలైంది. అది కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. జనాలను భయపెడుతోంది. ఢిల్లీలో గత 24 గంటల్లో 8 వేలకు పైగా కేసులు రికార్డయ్యాయి. బుధవారం నాడు ఒక్క రోజులోనే 8,593 మందికి కరోనా సోకినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

నిన్న ఒక్క రోజు రికార్డు స్థాయిలో కేసులు వచ్చాయి. ఈ స్థాయిలో కేసులు గతంలో ఎప్పుడూ నమోదు కాలేదు. కరోనా పీక్స్ లో ఉన్నప్పుడు కూడా ఇంతగా కేసులు పెరగలేదు. కొద్ది రోజులుగా ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది.

ఈ నెల పదో తేదీనాడు ఢిల్లీలో 7,830 కేసులు వచ్చాయి. సోమవారం 5023 కేసులు వచ్చాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 4,59,975 కు చేరింది.

Next Story
Share it