Top
Batukamma

గుడ్ న్యూస్ : కరోనా నుంచి విముక్తి ఎప్పుడంటే..?

Corona cases in india
X
Highlights

కొద్ది రోజులుగా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గత మూడు వారాలుగా దేశంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి

కరోనాతో అల్లాడుతున్న దేశ ప్రజలకు కాస్త రిలీఫ్ ఇచ్చే విషయం. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలై 7 నెలలు అవుతోంది. లాక్ డౌన్ టైంలో వైరస్ వ్యాప్తి కాస్త తగ్గినా.. ఆ తర్వాత మళ్లీ ఊపందుకుంది. దేశంలో విపరీతంగా కేసులు పెరిగిపోయాయి.

కొద్ది రోజులుగా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గత మూడు వారాలుగా దేశంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి పాజిటివ్ కేసులు తగ్గి.. రికవరీ రేటు పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాలు మినహా చాలా రాష్ట్రాల్లో పాజిటివ్ రేటు తగ్గింది.

కేరళ, కర్నాటక, బెంగాల్, రాజస్థాన్, చత్తీస్ ఘర్ లో మాత్రమే కేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్ రేటు తగ్గి.. రికవరీ రేటు పెరిగితే.. కరోనా కంట్రోల్ లోకి వచ్చినట్టేనని గతంలోనే ఎక్స్ పర్ట్స్ చెప్పారు.

దీనికి బలం చేకూర్చే విధంగా మరో గుడ్ న్యూస్ చెప్పారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. భారత్... కరోనా పీక్ స్టేజ్ ను దాటేసిందని చెప్పారు. దీంతో వచ్చే ఏడాది ప్రారంభంలో కరోనా వ్యాప్తి పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చే ఛాన్స్ ఉందని కేంద్రం ఏర్పాటు చేసిన ఎక్స్ పర్ట్స్ కమిటీ ప్రకటించింది. అన్నీ రకాల నిబంధనలు, జాగ్రత్తలు సరిగా ఫాలో అయితే.. 2021 ప్రారంభంలోనే కరోనాకు గుడ్ బై చెప్పవచ్చంటున్నారు.

అయితే.. ఇందులో మరో సమస్య వచ్చి పడింది. చలికాలం ప్రారంభం అవుతోంది. దీనికి తోడు పండగల సీజన్. ఈ రెండు కలిసి ... కరోనా వ్యాప్తిని మరోసారి పీక్స్ కు తీసుకెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

అయితే ఇది నెలకు 26 లక్షల కేసులకు మించదని చెప్పింది. అయితే ప్రస్తుతం 75 లక్షలుగా ఉన్న కేసులు.. వైరస్ కంట్రోల్ అయ్యే నాటికి 10.5 మిలియన్లుగా ఉంటుందని.. అంచనా వేస్తున్నారు.

పండగల కారణంగా ఇప్పుడు కేసులు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు ఎక్స్ పర్ట్స్. కేరళలో ఓనం పండుగ తర్వాత కరోనా కేసులు పెరిగాయంటున్నారు. అక్కడ దాదాపు 32 శాతం కేసులు పెరిగాయని.. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చని చెబుతున్నారు.

Next Story
Share it