Top
Batukamma

బీజేపీకి ఓటేస్తేనే ఉచితంగా కరోనా వ్యాక్సిన్.. సోషల్ మీడియాలో రచ్చ

బీజేపీకి ఓటేస్తేనే ఉచితంగా కరోనా వ్యాక్సిన్.. సోషల్ మీడియాలో రచ్చ
X
Highlights

ప్రజలకు ఉచితంగా ఇయ్యాల్సిన వ్యాక్సిన్ ను కూడా.. వాళ్లేదో వారి పార్టీ నిధుల్లోంచి ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు.

రాజకీయ నాయకులు దేన్నీ వదలరు. వాళ్లకు ఓట్లు పడటం కోసం ఎలాంటి హామీలైనా ఇస్తారు. ఎంతటి దిగజారుడు పనులైనా చేస్తారు. ఎన్నికలొచ్చిన ప్రతీచోట.. ప్రతీసారి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.

ప్రస్తుతం దేశం కరోనా వైరస్ తో అల్లాడుతోంది. కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ రేటు తగ్గుతున్నా.. వైరస్ ఉధృతి మాత్రం పూర్తిగా తగ్గలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అటు వైరస్ కు వ్యాక్సిన్ ను తయారుచేసే పనిలో ప్రపంచదేశాలు బిజీగా ఉన్నాయి. భారత్ లోనూ వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి.

అయితే.. కరోనా వ్యాక్సిన్ ను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. వాస్తవానికి దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ప్రజలందరికి ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్ అందించాలి. అది ప్రభుత్వ భాద్యత.

కానీ అదేదో తాము మెహర్బానీగా ఇస్తున్నట్టు ప్రచారాలు మొదలుపెట్టాయి పార్టీలు. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్ లో ఈ డ్రామాకు తెరలేపింది బీజేపీ. తమకు ఓటేస్తే రాష్ట్రంలోని ప్రజలందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ బంపర్ తో కూడిన మేనిఫెస్టోను స్వయంగా దేశ ఆర్థికమంత్రి నిర్మలసీతారామన్ విడుదల చేయడం మరో విశేషం.


మధ్యప్రదేశ్ లోనూ కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు జరుగుతున్నాయి. వాళ్లు ఊరుకుంటారా..? మేం ఏం తక్కువ అనుకున్నాడో ఏమో.. మధ్యప్రదేశ్ సీఎం కూడా తమకు ఓటేస్తే వ్యాక్సిన్ ఫ్రీ అని అనౌన్స్ చేశాడు.

అందరు వ్యాక్సిన్ ఫ్రీ అని ఫుల్ గా పబ్లిసిటీ కొట్టేస్తున్నారు... ఎలా.? అని ఆలోచించిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి కూడా మాకు ఓటేస్తే వ్యాక్సిన్ ఫ్రీ.. అని తమిళ తంబీలకు కూడా ఆఫర్ ఇచ్చేశాడు.

ఆల్రెడీ దేశమంతా వ్యాక్సిన్ సప్లై చేస్తామని ప్రధాని ప్రకటించారు. దాని తర్వాత ఇలా ఎన్నికలున్నా ప్రతీ రాష్ట్రంలో వ్యాక్సిన్ ఫ్రీ అంటూ అక్కడి ప్రభుత్వాలు ప్రచారం చేసుకోవడం ఏంటో అర్థం కాని పరిస్థితి. ప్రజలకు ఉచితంగా ఇయ్యాల్సిన వ్యాక్సిన్ ను కూడా.. వాళ్లేదో వారి పార్టీ నిధుల్లోంచి ఖర్చు పెట్టి ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు.

అమెరికా, రష్యాతో పాటు.. చాలా దేశాలు ఇప్పటికే తమ దేశ ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించాయి. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. కానీ మన దేశంలో మాత్రం వ్యాక్సిన్ రెడీ కాకముందే.. దాన్ని కూడా ఎన్నికల కోసం వాడేస్తున్నారు మన రాజకీయ నాయకులు.

Next Story
Share it