Top
Batukamma

కరోనా వ్యాక్సిన్ ఎవరికిస్తారు..? ఎప్పుడిస్తారు..? వ్యాక్సిన్ రేటెంత..?

కరోనా వ్యాక్సిన్ ఎవరికిస్తారు..? ఎప్పుడిస్తారు..? వ్యాక్సిన్ రేటెంత..?
X
Highlights

వ్యాక్సిన్ రెడీ అయినా.. పంపిణీ విషయంలో మాత్రం ప్రజల్లో చాలా అనుమానాలున్నాయి.

Corona vaccine distribution in india : దేశంలో కరోనా వ్యాక్సిన్ రెడీ అయ్యింది. ఆక్స్ ఫర్డ్ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్ కు నిపుణుల కమిటీ ఓకే చెప్పింది. డ్రగ్ కంట్రోల్ అథారిటీ కూడా ఓకే చెబితే వ్యాక్సిన్ పంపిణీ మొదలు కానుంది. దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి ప్రభుత్వాలు.

వ్యాక్సిన్ రెడీ అయినా.. పంపిణీ విషయంలో మాత్రం ప్రజల్లో చాలా అనుమానాలున్నాయి. వ్యాక్సిన్ ఎవరికి ఇస్తారు.? ఎప్పుడు ఇస్తారు..? ఎలా ఇస్తారు..? వ్యాక్సిన్ రేటెంత..? ఇలాంటి చాలా అంశాలపై ప్రజల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి.

అయితే.. ప్రస్తుతానికి వ్యాక్సిన్ సామాన్య జనానికి ఇవ్వరు. కరోనా వారియర్స్ అయిన డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ స్టాఫ్, పోలీసులు, భద్రతా సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తారు.

వారి తర్వాత వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తారు. ఇందులో కూడా ప్రాధాన్యతను నిర్ణయిస్తారు. రెండు మూడు రకాల వ్యాధులతో ఉండి ఆరోగ్యం ప్రమాదకరంగా ఉన్నవారికి వ్యాక్సిన్ మొదట ఇస్తారు.


ఇలా మొత్తంగా రాబోయే 8 నెలల్లో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం కోల్డ్ స్టోరేజీ వ్యవస్థ, హెల్త్ సిబ్బందిని సిద్ధం చేశారు. వారికి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు.

అయితే వ్యాక్సిన్ రేటు విషయంలోనూ చాలా కాలంగా అనుమానాలు కొనసాగుతున్నాయి. అయితే.. ప్రస్తుతానికి వ్యాక్సిన్ ప్రీగానే ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వారియర్లందరికి వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తారు. పోలియో వంటి వ్యాక్సిన్ మాదిరిగానే ఇది కూడా ఉచితమే అన్నమాట.

ఓ వ్యక్తికి కరోనా వ్యాక్సిన్ ఖచ్చితంగా రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. 28 రోజుల గ్యాప్ తో రెండు డోసులు ఇవ్వాలి. బ్రిటన్ లోనూ ఇదే విధంగా 28 రోజుల గ్యాప్ తో వ్యాక్సిన్ ఇస్తున్నారు. మనదేశంలోనూ ఇదే విధానాన్ని ఫాలో కావాలని నిర్ణయించారు.

అయితే.. వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో డెవలప్ అయి.. మార్కెట్ లోకి వచ్చినప్పుడు మాత్రం ధర నిర్ణయించి విక్రయిస్తారు. అది ఎంత ఉంటుందనే దానిపై ఇప్పటి వరకు సంస్థలు క్లారిటీ ఇవ్వలేదు. కానీ .. తక్కువ ధరకే ఇస్తామని మాత్రం చెబుతున్నాయి.

Next Story
Share it