Top
Batukamma

ఢిల్లీలో మరోసారి పేలిన కరోనా బాంబ్.. థర్డ్ వేవ్ స్టార్ట్ అయ్యింది..!

Coronavirus Daily Cases Crossed 5,000 Mark In Delhi
X
Highlights

ఢిల్లీ మరోసారి కరోనా హాట్ స్పాట్ అయ్యింది. కరోనా బీభత్సంగా ఉన్న టైం కంటే ఇప్పుడు అక్కడ ఎక్కువ కేసులు రికార్డ్ అవుతున్నాయి.

Coronavirus Daily Cases Crossed 5,000 Mark In Delhi : దేశంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయని సంతోషపడుతున్న టైంలో మరో బాంబ్ పేలింది. కొద్ది రోజులుగా దేశంలో పాజిటివ్ రేటు తగ్గి రికవరీ రేటు పెరిగింది. ఇటీవలే.. రికవరీ రేటు 90 శాతాన్ని దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

అయితే.. చలికాలం కావడం, పండుగలు రావడంతో కరోనా కేసులు(corona cases in delhi) భారీగా పెరిగే అవకాశముందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి కూడా చెప్పారు.

ప్రస్తుతం ఢిల్లీలో ఇదే భయం కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత మొదటిసారిగా ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవడంతో కొత్త టెన్షన్ పుట్టిస్తోంది.

బుధవారం రోజున ఢిల్లీలో కరోనా కేసులు 5 వేలు దాటిపోయాయి. బుధవారం నాడు 5673 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. చలికాలం ప్రారంభం కావడంతో పొల్యూషన్ తో అంతా పరేషాన్ అవుతున్నారు. ఈ టైంలో ఢిల్లీలో కేసులు పెరగడం మరోసారి టెన్షన్ పుట్టిస్తోంది.

గత కొద్ది రోజులుగా ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. గత శుక్రవారం 4086 మందికి పాజిటివ్ వచ్చింది. శనివారం 4116, ఆదివారం 4136, సోమవారం 2832 మందికి, మంగళవారం రోజున 4853 మందికి పాజిటివ్ వచ్చినట్టు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. మంగళవారం రోజున 44 మంది చనిపోయారు.

ఇప్పటికే ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 3.7 లక్షలు దాటిపోయింది. ఇప్పటి వరకు 6396 మంది చనిపోయారు.

అయితే.. ఇది చలికాలం ఎఫెక్టా.. లేకపోతే పండగల ఎఫెక్టా..? ఇంతమందికి ఎలా వ్యాపించిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

అటు దేశ వ్యాప్తంగా కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వైరస్ (corona cases in delhi) లేదని లైట్ తీసుకుంటున్న వారికి ఢిల్లీ ఓ హెచ్చరిక లాంటిదని చెబుతున్నారు.

- రేపే కవిత ప్రమాణస్వీకారం.. మరి కేబినెట్ లోకి ఎప్పుడో..?

- 9 మందిని చంపినోడికి ఉరిశిక్ష వేసిన కోర్టు

- సాఫ్ట్ బ్యూటి పైన కన్నేసిన హాట్ డైరెక్టర్!

Next Story
Share it