Top
Batukamma

పిల్లాడిని ఏడాది అద్దెకిస్తే.. రూ.12 లక్షలు ఇస్తున్నారట..!

Delhi band baaja baraat gang
X
Highlights

అక్కడ జరిగే ఫంక్షన్లలోకి బంధువుల్లాగే ఎంట్రీ ఇస్తారు. వారితో కలిసి పోతారు.

Delhi band baaja baraat gang: దొంగలు చాలా రకాలుగా ఉంటారు. చెడ్డీ గ్యాంగ్ మొదలు చైన్ స్నాచ్ గ్యాంగుల వరకు చాల రకాల దొంగల గురించి వింటూనే ఉంటాం.. టీవీల్లో పేపర్లలో చూస్తూనే ఉంటాం.

కానీ ఇప్పుడు ఢిల్లీలో(delhi) ఓ బ్యాచ్ పట్టుబడింది. ఆ దొంగల ముఠా పేరు "బ్యాండ్ బాజా బరాత్(band baaja baraat)". బాలీవుడ్ సినిమా పేరు పెట్టుకుని.. ధనవంతుల పెళ్లిళ్లకు వెళ్లి.. వాళ్లకు బ్యాండ్ బజాయించి వస్తున్నారు.

ఈ ముఠా మధ్యప్రదేశ్(madyapradesh) కు చెందినదని పోలీసులు గుర్తించారు. వీరి కదలికలపై నిఘాపెట్టి.. ఇటీవల ఢిల్లీలో అరెస్ట్ చేశారు.

ఈ ముఠా చోరీ విధానమే వెరైటీగా ఉంటుందట. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్(ncr) పరిధే వీరికి చోరీ స్పాట్. అక్కడ మాత్రమే చోరీలు చేస్తారు. దొరికిన కాడికి సర్దుకుని ఊరికి వెళ్లిపోతారు.

ఢిల్లీ.. దాని చుట్టుపక్కలున్న భారీ ఫంక్షన్ హాల్స్, బ్యాంకెట్ హాల్స్.. ఫామ్ హౌసుల్లో రెక్కీ నిర్వహిస్తారు. అక్కడ జరిగే ఫంక్షన్లలోకి బంధువుల్లాగే ఎంట్రీ ఇస్తారు. వారితో కలిసి పోతారు.


ఇలా వెళ్లగానే అలా చోరీ చేయరు. అక్కడే చాలాసేపు ఉంటారు. భోజనం చేస్తారు. అందరితో కలిసిపోయినట్టుగా ఉంటారు. అదను కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అంతా కూల్.. అనుకున్నాక క్షణాల్లో.. అక్కడున్న జువెల్లరీ గిఫ్ట్ బాక్స్ లు, క్యాష్ తో జంప్ అవుతారు.

అయితే.. ఈ చోరీలు చేసే వాళ్లలో చాలా మట్టుకు మైనర్లే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వీరికి గ్రామంలో అద్దెకు తీసుకొస్తారట. ఒక్కో పిల్లాడికి ఏడాదికి 10 నుంచి 12 లక్షలు ఇస్తారట. వారిని మధ్యప్రదేశ్ లోని తమ గ్రామం నుంచి ఢిల్లీ(delhi) తీసుకొచ్చి అక్కడ చోరీ చేయడంలో మెలకువలు నేర్పిస్తారట.

అక్కడివారికి.. సెక్యూరిటీ సిబ్బందికి.. చిక్కకుండా ఎలా చోరీ చేయాలో వీరికి చాలా బాగా నేర్పిస్తారట. ఒకవేళ పట్టుబడితే... ఇతరుల పేర్లు చెప్పకుండా ఉండేలా ట్రైనింగ్ ఇస్తారట.

ఇలాంటి దొంగతనాలు ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరిగిపోవడంతో పోలీసులు(police) ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతో దర్జాగా సూటు.. బూటు.. వేసుకుని వచ్చి దోచుకుని పోతున్న ఈ ముఠాలోని ఓ ఐదుగురు పట్టుబడ్డారు. వారిని పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించడంతో మొత్తం చెప్పేశారు.

ఈ ముఠాను నడిపిస్తున్న కీలక సభ్యుల కోసం పోలీసులు ఇప్పుడు వెతుకుతున్నారు.

- దొరకు అధికారమిస్తే.. నిరుద్యోగులను ఎట్ల దేకుతడు..?

- 05-12-2020 శనివారం నేటి రాశిఫలాలు

Next Story
Share it