Top
Batukamma

డేరింగ్ అండ్ డాషింగ్ .. ఈ లేడి సింగం గురించి తెలుసుకోవాల్సిందే!

డేరింగ్ అండ్ డాషింగ్ .. ఈ లేడి సింగం గురించి తెలుసుకోవాల్సిందే!
X
Highlights

ఇప్పుడు ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వాయువ్య ఢిల్లీలోని సమాయపూర్ బద్లీ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తోంది ఈ సీమా..

దేశ రాజధాని ఢిల్లీలో పనిచేస్తున్న సీమా ధాకా అనే ఓ హెడ్ కానిస్టేబుల్ తప్పిపోయిన 76 మంది పిల్లలను గుర్తుంచి వారిని వారి కుటుంబాలకు చేర్చింది.. కొత్త ప్రోత్సాహక పథకం కింద దాదాపు మూడు నెలల్లో తప్పిపోయిన 76 మంది పిల్లలను ఆమె గుర్తించారు.

ఇప్పుడు ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వాయువ్య ఢిల్లీలోని సమాయపూర్ బద్లీ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తోంది ఈ సీమా.. దాదాపుగా 12 నెలల్లో 76 మంది పిల్లలను కనిపెట్టినందుకుగాను సీమా ధాకా ఔట్-ఆఫ్-టర్న్ ప్రమోషన్ అందుకున్నారు.

ఇలా ప్రమోషన్ అందుకున్న మొదటి పోలీస్ ఆమెనే కావడం విశేషం. దీనితో ఉన్నతాధికారులు ఆమెకి అభినందనలు తెలుపుతున్నారు. అంతేకాకుండా అసాధారణ్ కార్యా పురస్కార్ అవార్డుకు సీమాను ఎంపిక చేసినట్టుగా పోలీస్ శాఖ ప్రకటించింది.


సీమా 76 మంది పిల్లలను గుర్తించగా, వారిలో 56 మంది 14 సంవత్సరాల కంటే తక్కువవారే ఉన్నారు. కేవలం ఢిల్లీలో మాత్రమే కాకుండా గురుగావ్, ఘజియాబాద్, నోయిడా, పానిపట్, బీహార్ రాష్ట్రాలలో తప్పిపోయిన వారిని గుర్తించి వారిని వారి కుటుంబాలకు చేర్చారు సీమా.

ఓ ఇంటి నుంచి పిల్లలు తప్పిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తనకి తెలుసునని అన్నారు సీమా. అందుకే తానూ తప్పిపోయిన పిల్లలను కాపాడినట్టుగా వెల్లడించారు.

Next Story
Share it