Top
Batukamma

ట్రంప్ ఇందుకే ఓడిపోతున్నాడట... జోస్యం చెప్పిన నడ్డా!

ట్రంప్ ఇందుకే ఓడిపోతున్నాడట... జోస్యం చెప్పిన నడ్డా!
X

JP Nadda, Donald Trump

Highlights

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కరోనానే ప్రచారాస్త్రమైందని అన్నారు నడ్డా.. ఒకవేళ ట్రంప్ కనుక ఓడిపోతే దానికి మాత్రం కరోనానే కారణమవుతుందని నడ్డా పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు చాలా ఉత్కంఠగా కొనసాగుతున్నాయి.. దాదాపుగా ట్రంప్ ఓటమి ఖాయమైపోయినప్పటికి ఇంకొన్ని రాష్ట్రాలలో ఫలితాలు రావాల్సి ఉంది.. అయితే ట్రంప్ ఓటమి దిశగా పయనించడానికి కారణం ఇదేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జోస్యం చెప్పారు..

బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్భాంగాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న నడ్దా మాట్లాడుతూ.. అమెరికాలో కరోనాని కంట్రోల్ చేయకపోవడం వల్లే ట్రంప్ ఓటమి పాలవుతున్నారని వ్యాఖ్యానించారు..

ఇక పనిలో పనిగా ప్రధాని మోడీ పైన ప్రశంసలు కురిపించారు జేపీ నడ్డా.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ప్రధాని మోడీ సకాలంలో సంచలన నిర్ణయాలు తీసుకొని దేశాన్ని మరియు 130 కోట్ల జనాభాను కాపాడాడరని నడ్డా అన్నారు..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కరోనానే ప్రచారాస్త్రమైందని అన్నారు నడ్డా.. ఒకవేళ ట్రంప్ కనుక ఓడిపోతే దానికి మాత్రం కరోనానే కారణమవుతుందని నడ్డా పేర్కొన్నారు. ప్రస్తుతం నడ్డా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

అటు దేశంలో కరోనా కేసుల సంఖ్య 84 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 47,638 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 84,11,724కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 5,20,773గా ఉండగా, ఇప్పటి వరకు 77,65,966 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న 670 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 1,24,985కు చేరింది.



Next Story
Share it