Top
Batukamma

భారీగా పెరుగుతున్న వంటనూనెల ధరలు..!

Edible Oil Prices
X
Highlights

నూనెల ధరలు సల సల మరిగిపోతున్నాయి. దీంతో ఇప్పటికే కరోనా కష్టాల్లో ఉన్న సామాన్యుడి జేబుకు భారీగా చిల్లుపడుతోంది.

Edible Oil Prices: మొన్నటి దాకా ఉల్లి ధరలతో అల్లాడిన ప్రజలకు ఇప్పుడు వంట నూనెలు చుక్కలు చూపిస్తున్నాయి. నూనెల ధరలు సల సల మరిగిపోతున్నాయి. దీంతో ఇప్పటికే కరోనా కష్టాల్లో ఉన్న సామాన్యుడి జేబుకు భారీగా చిల్లుపడుతోంది.

వేరుశనగ, ఆవ, సోయాబీన్ , పొద్దుతిరుగుడు, పామ్ ఆయిల్.. ఇలా అన్ని రకాల నూనెల ధరలు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే 20 నుంచి 30 శాతం వరకు వంటనూనెల ధరలు పెరిగాయి. సోయాబీన్, పామ్ ఆయిల్, ఫ్లవర్ ఆయిల్ 30 శాతం వరకు పెరిగాయి.

గతేడాది ఆవనూనె లీటర్ 100 రూపాయలు ఉండగా ఇప్పుడు 120కి చేరింది. వనస్పతి ఆయిల్ గతేడాది 75 రూపాయలుంటే. .ఇప్పుడు 102 రూపాయలకు పెరిగింది. ఇక సోయాబీన్ లీటర్ 90 రూపాయలుంటే ఇప్పుడు 110 చేరిపోయింది.

ప్రస్తుతం చెన్నైలో లీటర్ వేరుశనగ నూనె 187 రూపాయలు పలుకుతోంది. గతేడాది ఇదే సమయానికి లీటర్ నూనె ధర 141 రూపాయలు. ఒక పొద్దుతిరుగుడు నూనె గతేడాది 96 రూపాయలుంటే ఇప్పుడు అది 135కు ఎగబాకింది.

- సింగర్ లిప్సిక లెటెస్ట్ ఫొటోలు

- డేరింగ్ అండ్ డాషింగ్ .. ఈ లేడి సింగం గురించి తెలుసుకోవాల్సిందే!

- ఈ ఏజ్ లోనూ అదరగొడుతున్న ప్రియమణి


ఇటీవల దేశంలో ఉల్లి ధరలు పెరగడంతో ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందారు. 20 కేజీ ఉన్న ఉల్లి.. సడెన్ గా 100 రూపాయల వరకు వెళ్లింది. దీంతో బఫర్ స్టాక్ లో ఉన్న ఉల్లిని బయటకు తీశారు. అలాగే విదేశాలకు ఎగుమతులు ఆపేశారు. దీంతో మళ్లీ ధరలు దిగొచ్చాయి.

అయితే.. ఇప్పుడు ఆయిల్ ధరలు(Edible Oil Prices) సర్కారుకు చుక్కలు చూపిస్తున్నాయి. ధరలు తగ్గించడం ఎలా.? అని కేంద్ర ప్రభుత్వం చర్చిస్తోందట.


అయితే.. మలేసియాలో పామ్ ఆయిల్ ఉత్పత్తి తగ్గడమే దేశంలో ఆయిల్ ధరలు పెరగడానికి కారణమనే మాట వినిపిస్తోంది. ఆరు నెలలుగా ఆయిల్ పామ్ దిగుమతులు కూడా తగ్గిపోయాయి. దీంతో ధరలకు రెక్కలొచ్చాయి. దేశంలో ఎక్కువశాతం.. ప్రాసెస్ చేసిన పామ్ ఆయిల్ ను వాడుతుంటారు. దీంతో ధరలపై పామ్ ఆయిల్ తీవ్ర ప్రభావం చూపించింది.

ధరల పెరుగుదలకు కళ్లెం వేసే పనిలో ఉందట కేంద్రం. పామ్ ఆయిల్ దిగుమతులు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. అలాగే దిగుమతి సుంకం కూడా తగ్గించాలనే ఆలోచనలో ఉందట.

Next Story
Share it