Top
Batukamma

వీడేవడండి బాబోయ్ .. ఏకంగా బస్‌ స్టాప్‌నే ఎత్తుకెళ్లాడు!

వీడేవడండి బాబోయ్ .. ఏకంగా బస్‌ స్టాప్‌నే ఎత్తుకెళ్లాడు!
X

Entire bus stop stolen

Highlights

Entire Bus Stop Stolen : ఇంతవరకు కార్లు, బైకులు దొంగతనం చేసినవి చూసుంటాం.. విని ఉంటాం.. చివరికి బస్సును ఎత్తుకెళ్ళిన ఘటనలు కూడా చూసుంటాం.. కానీ ఇక్కడో దొంగ మాత్రం ఏకంగా బస్‌ స్టాప్‌నే దొంగతనం చేశాడు

Entire Bus Stop Stolen : ఇంతవరకు కార్లు, బైకులు దొంగతనం చేసినవి చూసుంటాం.. విని ఉంటాం.. చివరికి బస్సును ఎత్తుకెళ్ళిన ఘటనలు కూడా చూసుంటాం.. కానీ ఇక్కడో దొంగ మాత్రం ఏకంగా బస్‌ స్టాప్‌నే దొంగతనం చేశాడు. వినడానికి, నమ్మడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నమ్మదగ్గ విషయమే..

ఈ విచిత్ర సంఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని కొందరు దుండగులు లోకల్‌ బస్‌ స్టాప్‌ని దొంగతనం చేశారు.. మహానగర్‌ పరివహన్‌ ప్రజల కోసం దేవాకి ప్యాలెస్‌ ముందు బిటి కవాడే వద్ద ఏర్పాటు చేసిన ఈ లోకల్ బస్ స్టాప్ ని దొంగలు ఎత్తుకేల్లిపోయారు.




ఈ మ్యాటర్ అక్కడ పోలీసులను మాత్రమే కాదు లోకల్ లీడర్లను కూడా పరేషాన్ చేసింది. దొంగలను పట్టిస్తే.. వారికి ఐదు వేల రూపాయల బహుమతి ఇస్తామంటూ లోకల్ లీడర్లు ఓ ప్రకటనను కూడా ఇచ్చేశారు. దీనితో ఇష్యూ బయటకు వచ్చింది. మాజీ ఎన్‌సీపీ కార్పొరేటర్‌ ప్రశాంత్‌ మాస్కే ఏర్పాటు చేసిన బ్యానర్‌ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.


అక్కడి స్థానికులను ఇదే విషయం పైన అడగగా.. పగటిపూట ఇలాంటి సంఘటన జరిగే ఛాన్స్ లేదని, కచ్చితంగా అర్ధరాత్రి ఈ సంఘటన జరిగినట్టుగా తెలుపుతున్నారు. ఇక ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఇప్పటికే ఆ దొంగలు ఆ బస్ స్టాప్ ని ముక్కలుగా చేసి పాత ఇనుప సామానుల వాడికి అమ్మేసుకున్నారేమో.. అని ఒకరంటే.. RTC పైన ఎంత కోపం ఉంటే మాత్రం బస్ స్టాప్ ఎత్తుకెళ్ళడం దారుణం అని అభిప్రాయపడుతున్నారు.

Next Story
Share it