Top
Batukamma

ఆవులను ఎత్తుకెళ్తున్న భజరంగ్ దళ్ మాజీ జిల్లా అధ్యక్షుడు..!

ఆవులను ఎత్తుకెళ్తున్న భజరంగ్ దళ్ మాజీ జిల్లా అధ్యక్షుడు..!
X
Highlights

ఏకంగా గోవులను స్మగ్లింగ్ చేస్తూ గోవధశాలలకు అమ్మేస్తున్నాడు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడంతో అతగాడి భండారం బయటపడింది.

BAJARANJDAL LEADER STEALING COWS:గో రక్షణ పేరుతో భజరంగ్ దళ్ లో తిరిగిన ఓ వ్యక్తే ఇప్పుడు.. ఏకంగా గోవులను స్మగ్లింగ్ చేస్తూ గోవధశాలలకు అమ్మేస్తున్నాడు. గోవుల అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడంతో అతగాడి భండారం బయటపడింది.

మంగళూరుకు చెందిన ముహమ్మద్ యాసిన్ అనే వ్యక్తిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. గోవులను(COW) అక్రమంగా తీసుకెళ్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

అతని వెనుక పెద్ద రాకెటే ఉందని అనుమానం వచ్చిన పోలీసులు తమదైన స్టైల్లో ఇంటరాగేషన్ చేశారు. దీంతో మరో వ్యక్తి పేరు బయటకు వచ్చింది.

అతనే కర్కాల జిల్లాకు చెందిన అనిల్ ప్రభు(ANIL PRABHU). ఇతను గతంలో భజరంగ్ దళ్(BAJARANJDAL) కు కర్కాల జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. అప్పటి నుంచే ఈ దందాలోకి దిగినట్టు తెలుస్తోంది.

యాసిన్, అనిల్ ప్రభు.. ఇద్దరు కలిసి రోడ్లపై తిరిగే ఆవులకు ఎత్తుకెళ్లి గోవధశాలలకు(slaughterhouses) అమ్మేస్తున్నారని విచారణలో వెల్లడైంది. దీనికోసం గోవధశాలల నుంచి భారీగానే డబ్బులు వసూలుచేస్తున్నారట. అంతేకాదు.. గోవధశాలలవైపు.. గోరక్షకులు రాకుండా ఉండేందుకు కూడా డబ్బులు తీసుకుంటున్నట్టు పోలీసు విచారణలో బయటపడింది.

అయితే.. భజరంగ్ దళ్ మాత్రం.. ప్రస్తుతం అతనితో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది.

- ప్యాంట్ లేకుండా అనసూయ ... రచ్చ లేపింది పో

- ఫొటో పెట్టి మరీ తిట్టించుకుంటున్న తెలుగు టాప్ యాంకర్..!

- మోడీ బండారం బయటపెట్టిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి..!

-

Next Story
Share it