Top
Batukamma

కోడిగుడ్డు కూర పెట్టలేదని.. కొట్టి చంపాడు..!

కోడిగుడ్డు కూర పెట్టలేదని.. కొట్టి చంపాడు..!
X
Highlights

మనుషులు రోజురోజుకి విచక్షణ కోల్పోతున్నారు. చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా స్పందిస్తున్నారు. కిరాతకంగా వ్యవహరిస్తున్నారు.

మనుషులు రోజురోజుకి విచక్షణ కోల్పోతున్నారు. చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా స్పందిస్తున్నారు. కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది. అందరి హృదయాల్ని కలచివేస్తోంది.

మహారాష్ట్రలో లోని నాగపూర్ జిల్లా మంకాపూర్ కు చెందిన బన్సారీ. గౌరవ్ గైక్వాడ్ ఫ్రెండ్స్. చాలాకాలంగా ఇద్దరు స్నేహితులు.. కావడంతో గైక్వాడ్ ను తన ఇంటికి భోజనానికి పిలిచాడు బన్సారీ. శుక్రవారం రాత్రి బన్సారీ ఇంటికి గైక్వాడ్ భోజనానికి వచ్చాడు.

ఫ్రెండ్ ను పిలిచి ఉత్త భోజనం పెడితే బాగుండదనుకున్నాడు. వస్తూ వస్తూ మద్యం కూడా తెచ్చుకున్నారు. ఇద్దరు కూర్చుని చాలా సేపు మద్యం సేవించారు. అది పూర్తయ్యాక భోజనం చేద్దామని లేచారు.

అయితే.. అక్కడే మొదలైంది గొడవ. తనకు ఎగ్ కర్రీ కావాలని బన్సారీని అడిగాడు గైక్వాడ్. అయితే.. ప్రస్తుతం ఇంట్లో కోడిగుడ్లు లేవని.. రాత్రి కావడంతో దుకాణాలు కూడా మూసేసి ఉన్నాయని చెప్పాడు.

అయినా గైక్వాడ్ వినిపించుకోలేదు. మద్యం మత్తులో ఉన్న అతను ఎగ్ కర్రీ కావాల్సిందేనని పట్టుబట్టాడు. ఇది కాస్తా గొడవ మారింది. ఇద్దరు చాలాసేపు వాదులాడుకున్నారు. ఇదే సమయంలో పక్కనే ఉన్న ఇనుప రాడ్ తో బన్సారీ తలపై బాదాడు.

దెబ్బ బలంగా తగలడంతో భారీగా రక్తస్రావం అయ్యింది. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story
Share it