Top
Batukamma

పిల్లలు పుట్టడం లేదని.. ఆరేళ్ల చిన్నారిని దారుణంగా చంపేశారు..!

పిల్లలు పుట్టడం లేదని.. ఆరేళ్ల చిన్నారిని దారుణంగా చంపేశారు..!
X
Highlights

చిన్నారి ఛాతిని చీల్చేసి.. అందులోంచి ఆమె ఊపిరితిత్తులకు బయటకు తీశారు నిందితులు.

ఉత్తరప్రదేశ్ లో దారుణాలు ఆగడం లేదు. హత్రాస్ ఘటన మరిచిపోకముందే మరో దారుణమైన సంఘటన జరిగింది.

కాన్పూర్ జిల్లాలోని భద్రాస్ లో ఈ ఘోరం జరిగింది. పిల్లలు పుట్టడం లేదని.. క్షధ్రపూజలు చేస్తే పిల్లలు పుడతారని అత్యంత ఘోరంగా చిన్నారి ప్రాణం తీశారు.

దీపావళి రోజు రాత్రి ఆరేళ్ల పాప.. ఇంటి సమీపంలో ఉన్న దుకాణంలో క్రాకర్స్ కొనేందుకు వెళ్లింది. ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు చుట్టుపక్కలంతా వెతికారు. కానీ ఎక్కడా చిన్నారి జాడ దొరకలేదు.

మరుసటి రోజు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ చిన్నారి డెడ్ బాడీ ఉందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెళ్లి పరిశీలిస్తే ఆ డెడ్ బాడీ చిన్నారిదేనని గుర్తించారు.

అత్యంత దారుణమైన స్థితిలో డెడ్ బాడీ దొరికింది. చిన్నారి ఛాతిని చీల్చేసి.. అందులోంచి ఆమె ఊపిరితిత్తులకు బయటకు తీశారు నిందితులు.

అయితే.. ఈ హత్య వెనుక మరో దారుణమైన సంఘటన దాగుందని పోలీసుల విచారణ వెల్లడైంది. చిన్నారిని కిడ్నాప్ చేశాక.. నిందితులు ఆమెపై లైంగిక దాడి చేశారు. ఆ తర్వాత చంపేశారు.

ఘటమ్ పూర్ కు చెందిన పర్షురాం కురిల్ కు 1999 పెళ్లైంది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. చిన్నారిని బలిచ్చి ఆమె ఊపిరితిత్తులతో పూజ చేస్తే పిల్లలు పుడతారని ఓ స్వామీజి చెప్పడంతో.. ఈ దారుణానికి ఒడిగట్టాడు ప్రధాన నిందితుడు.

తన బంధువులైన అంకుల్ కురిల్, బీరెన్ కు విషయం చెప్పడంతో వారు వెళ్లి చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడి చేసి.. ఆ తర్వాత క్షుధ్రపూజలు కోసం ఆమె ఛాతిని చీల్చేశారు.

ఈ విషయం నిందితుడి భార్యకు కూడా తెలుసునని పోలీసులు చెబుతున్నారు. అయినా.. ఎవరికి చెప్పుకుండా దాచిపెట్టిందన్నారు. దారుణం జరిగిన తర్వాత కూడా నిందితుడు పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నించాడు.

ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను కాన్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

- 1200 కోట్లతో భారీ హనుమంతుడి విగ్రహం.. ఎక్కడంటే..?

- 17-11-2020 మంగళవారం నేటి రాశిఫలాలు

- అమ్మడూ.. అంటూ యూట్యూబ్ ను కుమ్మేస్తున్న రోజా, శేఖర్ మాస్టర్

Next Story
Share it