Top
Batukamma

లెహ్ ను చైనాకు అప్పజెప్పిన ట్విట్టర్.. గట్టిగా వార్నింగ్ ఇచ్చిన భారత్

లెహ్ ను చైనాకు అప్పజెప్పిన ట్విట్టర్.. గట్టిగా వార్నింగ్ ఇచ్చిన భారత్
X
Highlights

మన సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్నారు. దాయాది సైన్యాన్ని తరిమికొడుతున్నారు. సరిహద్దును కాపాడుతున్నారు.

భారత్ పై దురాక్రమణ చేసేందుకు ఓ వైపు చైనా, మరోవైపు పాకిస్థాన్ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. వీటిని మన సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్నారు. దాయాది సైన్యాన్ని తరిమికొడుతున్నారు. సరిహద్దును కాపాడుతున్నారు.

కానీ.. ఆన్ లైన్ లో మాత్రం సరిహద్దులు మారిపోతున్నాయి. లార్జెస్ట్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఒకటైన ట్విట్టర్ ఈ విషయంలో భారీ తప్పిదం చేసినట్టు తెలుస్తోంది. లడక్ కేంద్ర పాలిత ప్రాంతంలో లెహ్ ప్రధాన పట్టణంగా ఉంది.

అయితే.. ఈ పట్టణం లొకేషన్ ను చైనాలో ఉన్నట్టు చూపించింది ట్విట్టర్. లడఖ్ లో మెయిన్ సిటీని ఇలా చైనాలో భాగంగా చూపించడంపై భారత సర్కారు ఫుల్ సీరియస్ అయ్యింది.

ట్విట్టర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ట్విట్టర్ సీఈవోకు ఓ లేఖ కూడా రాసినట్టు తెలుస్తోంది. భారత దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం వాటిల్లేలా ఏ పని చేసినా ఊరుకునేది లేదని తేల్చి చెప్పింది. లెహ్ భారత్ లో భాగమని అందరికి తెలుసు. అలాంటిది చైనాలో ఉన్నట్టు ఎలా చూపిస్తారని కాస్త గట్టిగానే ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. పదుల సంఖ్యలో సైనికుల ప్రాణాలు కూడా పోయాయి. బార్డర్ లో పరిస్థితిని చక్కదిద్దేందుకు రెండు దేశాల సైనికాధికారులు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

రెండు దేశాల మధ్య గతంలో జరిగిన ఒప్పందాల ప్రకారం నడుచుకోవాలని నిర్ణయించారు. కానీ చైనా మాత్రం కవ్వింపు చర్యలు మానుకోవడం లేదు.

Next Story
Share it