Top
Batukamma

రైలెక్కితే ఈ రూల్స్ పాటించాల్సిందే.. లేకుంటే జైలుకే..!

రైలెక్కితే ఈ రూల్స్ పాటించాల్సిందే.. లేకుంటే జైలుకే..!
X
Highlights

లేకపోతే రైల్వే చట్టం ప్రకారం 1989లోని పలు సెక్షన్ల కింద జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

బతుకమ్మ, దసరా,దీపావళి పండగలు వస్తున్న వేళ రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఒక పక్కా పండగ సీజన్ కావడం, మరో పక్కా కరోనా విజృంభిస్తుండడంతో రైల్వే శాఖ కొన్ని కీలకమైన మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.

ప్రయాణికులు రైల్వే స్టేషన్ లోకి ఎంటర్ ఆయునప్పటి నుంచి ఏక్సిట్ అయ్యేవరకు ఎలాంటి నిబంధనలను పాటించాలో వెల్లడించింది.. ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని లేకపోతే రైల్వే చట్టం ప్రకారం 1989లోని పలు సెక్షన్ల కింద జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

మాస్క్ ధరించకుండా రైల్వే పరిసరాల్లోకి రావొద్దు.

ఆరడుగుల భౌతిక దూరం పాటించాల్సిందే.

కరోనా పాజిటివ్ అని తెలిస్తే అసలు రైళ్లలోకి ప్రవేశించొద్దు.

ఒకవేళ కరోనా అని అనుమానం వచ్చి టెస్టుకి వెళ్లి ఫలితం రాకున్నా రైళ్లో ప్రయాణించవద్దు.

రైల్వే స్టేషన్లో వైద్య బృందం చెకప్ చేసేటప్పుడు నిరాకరిస్తే చర్యలు తప్పవు!

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసినా, చెత్తాచెదారం విసిరేసినా చర్యలు తప్పవు..

ప్రజలకి ఇబ్బంది కలిగించేలా అపరిశుభ్రత వాతావరణం సృష్టించిన చర్యలు తప్పవు..

Next Story
Share it