Top
Batukamma

Hathras case : హత్రాస్ కేసులో యోగికి షాకిచ్చిన సీబీఐ

Hathras case : హత్రాస్ కేసులో యోగికి షాకిచ్చిన సీబీఐ
X
Highlights

Hathras case CBI charges four with gang rape, murder : రెండు నెలల క్రితం ఉత్తరప్రదేశ్(uttarpradesh) లోని...

Hathras case CBI charges four with gang rape, murder : రెండు నెలల క్రితం ఉత్తరప్రదేశ్(uttarpradesh) లోని హత్రాస్(hathras) లో ఓ దళితయువతిపై అత్యాచారం,హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమ్మాయిపై లైంగికదాడి చేసి చంపారని కుటుంబసభ్యులు వాదించారు.

కానీ పోలీసులు మాత్రం లైంగికదాడి జరగలేదని.. చెప్పారు. ఫోరెన్సిక్ రిపోర్ట్(forensic report) లో అలాంటి ఆనవాళ్లు కూడా లేవని చెప్పారు. కానీ బాధితురాలి ఫ్యామిలీ మాత్రం.. దారుణం జరిగిందని.. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఏకంగా ఉత్తరప్రదేశ్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ ప్రెస్ మీట్ పెట్టి మరీ.. అమ్మాయిపై లైంగికదాడి జరగలేదని చెప్పారు. యూపీ ప్రభుత్వ పెద్దలు, చివరకు కేంద్రమంత్రులు(central ministers) కూడా ఇదే విషయం చెప్పారు. ఇష్యూను కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

కానీ.. రెండు నెలల తర్వాత అసలు విషయం బయటపడింది. హత్రాస్ బాధితురాలిపై గ్యాంగ్ రేప్(gangrape) జరిగిందని సీబీఐ(cbi) చార్జ్ షీట్ ఫైల్ చేసింది. నలుగురు నిందితులపై రేప్, మర్డర్ అభియోగాలు నమోదు చేసింది. 302 (మర్డర్), 376(రేప్), 376డి (గ్యాంగ్ రేప్) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టింది.


ఈ కేసుకు సంబంధించి 2000 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేశారు సీబీఐ అధికారులు. 700 పేజీల సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా అందజేశారు. జనవరి 4న కేసు మరోసారి విచారణకు రానుంది.

హత్రాస్ ఘటనలో పోలీసులు(up police), రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. నిందితులుగా ఉన్న నలుగురు కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్(up cm yogi adityanath) సామాజిక వర్గానికి చెందినవారు. ఆ గ్రామంతో పాటు.. రాష్ట్రంలో కూడా వారికి మంచి పట్టుంది. దీంతో కేసును మొదటి నుంచి తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగిందని ఆరోపణలు వచ్చాయి.

ఢిల్లీలోని హాస్పిటల్ లో అమ్మాయి చనిపోయిన తర్వాత అర్థరాత్రి హత్రాస్(hathras) తీసుకెళ్లారు. డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్లకుండా.. కుటుంబసభ్యులెవరూ లేకుండా.. వారి సాంప్రదాయాలకు విరుద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినా.. పోలీసులు, యూపీ సర్కారు పట్టించుకోలేదు.

చివరకు ఈ కేసులోకి సీబీఐ ఎంట్రీ ఇవ్వడంతో.. లైంగికదాడి జరగలేదని పోలీసులు ఇచ్చిన స్టేట్ మెంట్ తప్పని తేలింది. ఇప్పటి వరకు డిఫెండ్ చేస్తూ వచ్చిన యూపీ సర్కారు.. ఇప్పుడు చిక్కుల్లో పడింది.

- మళ్ళీ ప్రేమలో పడ్డా.. నాలుగో పెళ్ళికి రెడీ అంటున్న హీరోయిన్!

- Horoscope Telugu Today : 19-12-2020 శనివారం నేటి రాశిఫలాలు

- ఆపుకోలేకపోతున్నాం బాబోయ్ .. మొత్తం వదలండి!

- దిల్ రాజు లక్కీ.. అందంతో మతి పోగోడుతున్న వైఘారెడ్డి!

Next Story
Share it