పెళ్ళైన కొద్ది సేపటికే యువతి ఆత్మహత్య!

X
Highlights
ఇది జరిగిన కొద్దిసేపటికే సీమా ఆత్మహత్యకి పాల్పడింది. తన అత్తమామల ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
Batukamma21 Dec 2020 2:28 PM GMT
పెళ్ళైన కొద్ది గంటల్లోనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గోవాలో చోటు చేసుకుంది. గోవాలోని అంజునా ప్రాంతానికి చెందిన సీమా(46)కి అదే ప్రాంతానికి చెందిన గౌరీష్ చోదంకర్తో శనివారం సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది.
అయితే ఇది జరిగిన కొద్దిసేపటికే సీమా ఆత్మహత్యకి పాల్పడింది. తన అత్తమామల ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఎక్కడ కూడా ఆమె సూసైడ్ నోట్ కనిపించలేదు.ఇప్పటికే విచారణ ప్రారంభించగా, ఆత్మహత్య వెనుక గల కారణాలు ఇంకా నిర్ధారించబడలేదు.
ఆదివారం తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య ఈ సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని మొదట ఆమె మరిది చూసి ఆ తరువాత అతని కుటుంబానికి, పోలీసులకు వెల్లడించాడు.సోమవారం పోస్ట్మార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబానికి అప్పగిస్తారు.
Next Story