Top
Batukamma

ప్రభుత్వం కూలినా పోరాడుతూనే ఉంటా :అమరిందర్ సింగ్

ప్రభుత్వం కూలినా పోరాడుతూనే ఉంటా :అమరిందర్ సింగ్
X
Highlights

బ్లూ స్టార్ ఆపరేషన్ టైంలోనే పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ అసెంబ్లీ ఇవాళ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్.. తన పదవి పోయినా భయపడబోనన్నారు.

బ్లూ స్టార్ ఆపరేషన్ టైంలోనే పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. రాజీనామా చేసేందుకు తాను భయపడబోనన్నారు. జేబులోనే రాజీనామా లెటర్ పెట్టుకుని తిరుగుతానన్నారు అమరిందర్ సింగ్.

ప్రభుత్వం కూలిపోతుందని తనకు భయం లేదని.. రైతులను ఇబ్బంది పడనివ్వబోనని చెప్పారు. న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉంటానన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలు, ప్రతిపాదించిన ఎలక్ట్రిసిటీ చట్ట సవరణ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్ అసెంబ్లీ ఇవాళ తీర్మానం చేసింది.

వ్యవసాయ చట్టాలు, ఎలక్ట్రిసిటీ బిల్లు రైతులు, భూమిలేని కూలీలకు వ్యతిరేకమన్నారు. వ్యవసాయ చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని.. వ్యవసాయం స్టేట్ సబ్జెక్ట్ అని రాజ్యాంగం చెబుతోందన్నారు.

Next Story
Share it