Top
Batukamma

వచ్చే నెలలో 100 మిలియన్ డోసుల కరోనా వ్యాక్సిన్..!

వచ్చే నెలలో 100 మిలియన్ డోసుల కరోనా వ్యాక్సిన్..!
X
Highlights

వ్యాక్సిన్ విషయంలో మొదట చాలా ఆందోళన పడ్డామన్నారు పొన్నావాలా. కానీ ఆస్ట్రా జెనెకా.. నోవా వాక్స్ .. మంచి ఫలితాలనిస్తున్నాయన్నారు.

కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది సిరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా. త్వరలోనే దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ అదర్ పొన్నావాలా. డిసెంబర్ కల్లా భారీగా వ్యాక్సిన్ డోసులను రెడీ చేయబోతున్నట్టు చెప్పారు.

బ్లూమ్ బర్గ్ కు అదర్ పొన్నావాలా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో వ్యాక్సిన్ కు సంబంధించిన చాలా అంశాలు ఆయన వివరించారు. కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ఆస్ట్రాజెనెకా కంపెనీతో సిరం ఇనిస్టిట్యూట్ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగానే ఆల్రెడీ దేశంలో ప్రొడక్షన్ కూడా మొదలుపెట్టింది.

ప్రస్తుతం వ్యాక్సిన్ ప్రొడక్షన్ నడుస్తోందని.. డిసెంబర్ కల్లా 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్ రెడీ చేయనున్నట్టు సిరం ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. దేశంలో డిసెంబర్ లోనే వ్యాక్సిన్ పంపిణీ కూడా మొదలయ్యే అవకాశం ఉందని పొన్నావాలా అభిప్రాయపడ్డారు.

ఫైనల్ స్టేజ్ లో మంచి ఫలితాలివ్వడంతోనే ప్రొడక్షన్ మొదలుపెట్టినట్టు సిరం ఇనిస్టిట్యూట్ చెబుతోంది. అయితే.. వ్యాక్సిన్ కు పూర్తిస్థాయి అనుమతులు మాత్రం 2021 జనవరి ప్రారంభంలో వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తిస్థాయి అనుమతులు వచ్చాక.. దక్షిణాసియా దేశాలు, కోవాక్స్ మధ్య 50-50 షేరింగ్ లో వ్యాక్సిన్ పంపిణీ ఉంటుందని సిరం ఇనిస్టిట్యూట్ ప్రకటించింది.

- బావా.. బావా.. అంటూ జబర్దస్త్ బాక్స్ బద్దలుకొట్టింది..!

కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి 5 సంస్థలతో కలిసి పనిచేస్తోంది సిరం ఇనిస్టిట్యూట్. ఇప్పటికే 40 మిలియన్ల డోసులు తయారు చేసినట్టు సిరం ఇనిస్టిట్యూట్ చెబుతోంది. వ్యాక్సిన్ విషయంలో మొదట చాలా ఆందోళన పడ్డామన్నారు పొన్నావాలా. కానీ ఆస్ట్రా జెనెకా.. నోవా వాక్స్ .. మంచి ఫలితాలనిస్తున్నాయన్నారు.

మరోవైపు.. రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ ప్రొడక్షన్ పై మరింత ఫోకస్ పెట్టింది సిరం ఇనిస్టిట్యూట్. వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం 250 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నారు అదర్ పొన్నవాలా.

Next Story
Share it